చేర్యాల, మద్దూరు ప్రజలు కలిసిరావాలి
-
∙జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి
జనగామ : శతాబ్ద కాలంగా కలిసే ఉంటున్న చేర్యాల, మద్దూ రు ప్రజలు జనగామ జిల్లా అయ్యే తరుణాన ఉద్యమంలో కలిసిరావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ పూలే అధ్యయన కేంద్రం లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనగామ జిల్లా ఏర్పాౖటెతే చేర్యాల మున్సిపాలిటీగా, రెవె న్యూ డివిజన్‌తో పాటు నియోజక వర్గ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నా రు. తద్వారా అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఉద్యమంలో కలిసిరావాలని కో రారు. కాగా, జనగామను జిల్లా ఏర్పాటుచేయాలన్న ఉద్యమంలో కలిసిరావాలని కోరేందుకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుసుకునేం దుకు బుధవారం హైదరాబాద్ వెళ్తున్నట్లు దశమంతరెడ్డి వివరించారు. అలాగే, తమకు సహకరిస్తున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, డాక్టర్ లక్షీ్మనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.