6న ‘చలో హెచ్‌సీయూ’కి జేఏసీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) సామాజిక న్యాయ పోరాట ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) ఏప్రిల్ 6న ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చింది. రోహిత్ వేముల మృతికి, అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఏఎస్‌ఏ) నాయకుడు ప్రశాంత్ సహా నలుగురు విద్యార్థుల రస్టికేషన్‌కు కారణమైన వైస్ చాన్స్‌లర్ అప్పారావును పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన చేపడతున్నామని విద్యార్థి నేతలు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, జుహైల్ ‘సాక్షి’కి తెలిపారు. వీసీ పునరాగమనం వెనుక దాగి ఉన్న కుట్రను బట్టబయలు చేసేందుకే ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చినట్టు చెప్పా రు. అరెస్టులు, లాఠీచార్జీలు, జైలు గోడలను ఛేదించుకొని ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. ‘చలో హెచ్‌సీయూ’కు వేలాదిగా తరలి రావాలని కోరారు.