రాష్ట్ర జేఏసీ చైర్మన్‌గా బొప్పరాజు
Published Sun, Jan 29 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర జేఏసీ చైర్మన్‌గా బొప్పరాజు వెంకటేశ్వర్లును అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లుగా వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మినిస్టీరియల్ అధ్యక్షుడు ఎం.రమేష్, కర్నూలు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంబన్న తదితరులు ఈ విషయాన్ని శనివారం విలేకరులకు వెల్లడించారు. ఫిబ్రవరి 5వ తేదీన తిరుపతిలోని రెవెన్యూ భవన్‌లో బొప్పరాజు వెంకటేశ్వర్లును నూతన జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు వారు వివరించారు.
Advertisement
Advertisement