ప్రస్తుతం బీసీలకు ఉన్న రిజర్వేషన్ల వాటాకు ఏ మాత్రం భంగం కలగకుండా కాపులు తమకు గతంలో అమలైన రిజర్వేషన్లు పునరుద్ధరించమని మాత్రమే పోరాటం చేస్తున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ విషయంలో బీసీలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ముద్రగడతో కూడిన కాపు జేఏసీ బృందం అమలాపురంలోని బీసీ నేత, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఇంటికి శుక్రవారం వెళ్లి చర్చించింది.