శంఖారావం | Constituents of the flooded protest | Sakshi
Sakshi News home page

శంఖారావం

Published Thu, Oct 3 2013 3:32 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

శంఖారావం - Sakshi

శంఖారావం

సాక్షి, విశాఖపట్నం : ‘సమైక్య ఉద్యమం హోరెత్తిపోతోంది. ఉవ్వెత్తున ఎగసి విభజన కారకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్లూ ప్రజాందోళనలకు నాయకత్వలేమి బాధించేది. జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఆ కొరత తీరింది. రెండు మాసాలుగా సాగుతున్నపోరు ఒకెత్తు.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరించాక జోరు మరొకెత్తు’... ఇదీ సామాన్యుడి నుంచి ఉద్యోగ, కార్మిక వర్గాలందరి మనసులో మాట. నీతిమంతమైన రాజకీయాలే లక్ష్యంగా, సమైక్యాంధ్ర నినాదంతో రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీకి అన్ని వర్గాల నుంచీ భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది.
 
 పార్టీ అధినేత పిలుపుమేరకు బుధవారం నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ఆమరణ, నిరవధిక నిరాహార దీక్ష శిబిరాలు ప్రారంభించారు. సమన్వయకర్తల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఉద్యమం హోరెత్తిపోతోంది. జై జగన్.. జై సమైక్యాంధ్ర అంటూ దీక్ష శిబిరాల వద్ద నినాదాలు మిన్నంటుతున్నాయి. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నంలలో దీక్షలు చేపట్టినవారికి సంఘీభావం తెలిపారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెన క్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని విరమిం చేది లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా కుటిల రాజకీయాల్ని విడనాడి, తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని, సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు, ప్రోగ్రాం సమన్వయకర్త బుచ్చి మహేశ్వరరావుతోపాటు పలువురు నేతలు అన్ని శిబిరాల వద్దకు వెళ్లి తమ సంఘీభావం తెలిపారు.
 
 అనకాపల్లి : నియోజకవర్గంలోని నెహ్రూ చౌక్ వద్ద పార్టీ నేత కొణతాల లక్ష్మీనారాయణ(పెదబాబు), మందపాటి జానకిరామరాజు, డీవీవీ గోపాలరాజుతో పాటు 26 మంది 48 గంటల నిరాహార దీక్షకు దిగారు.
 
 చోడవరం : మెయిన్‌రోడ్డు, పంచాయతీ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావుతోపాటు 9 మంది నిరవధిక నిరాహార దీక్షలు చేస్తుండగా, పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ అన్నంరెడ్డి అదీప్‌రాజు, మరో ఐదుగురు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
 
 నర్సీపట్నం : సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పదుల సంఖ్యలో పార్టీ నాయకులు రిలే దీక్షల్లో కూర్చున్నారు.
 
 యలమంచిలి : పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రగ డ నాగేశ్వరావు, బొడ్డేడ ప్రసాద్‌లు శిబిరంలో దీక్షలో పాల్గొన్నారు. ఈ శిబిరానికి వెయ్యి మంది వరకు హాజరయ్యారు. వీరితోపాటు 9 మంది ఆమరణ నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు.
 
 పాయకరావుపేట : సూర్యమహల్ జంక్షన్లో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, 22 మంది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.  


 మాడుగుల: పాతబస్టాండ్ సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలునాయుడుతోపాటు పలువురు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు.
 
 అరకు : నాలుగు రోడ్ల కూడలి, వైఎస్సార్ విగ్రహం సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తల్లో ఒకరైన కుంభా రవిబాబు 48 గంటలు పాటు, సమీపంలోని మరో శిబిరంలో సమన్వయకర్తలు దొన్ను దొర, కిడారి సర్వేశ్వరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
 
 పాడేరు : ఐటీడీఏ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సీకర సత్యవాణితోపాటు పార్టీ నేతలు లకే రత్నబాయి, బి.కెజియారాణి, నిప్పుల సింహాచలం ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. పాత బస్టాండ్ సమీపంలో మరో సమన్వయకర్త గిడ్డి ఈశ్వరితోపాటు నాయకులు మత్స్యరాస బాలరాజు, ఎస్.వి.జి.రమణమూర్తి, సాము సుబ్రహ్మణ్యం, కూడా సింహాచలం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement