వుధ్యాహ్న భోజనం ఇలాగేనా? | జిల్లాలో పెరిగిన ఎంపీటీసీలు నవంబర్ 12న తుది జాబితా | Sakshi
Sakshi News home page

వుధ్యాహ్న భోజనం ఇలాగేనా?

Published Tue, Oct 29 2013 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

జిల్లాలో పెరిగిన ఎంపీటీసీలు నవంబర్ 12న తుది జాబితా

భాకరాపేట, న్యూస్‌లైన్: చిన్నగొట్టిగల్లు వుండల కేంద్రంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వుధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై మండల ప్రత్యేకాధికారి, జిల్లా హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగన్నగారిగడ్డ గ్రావు పరిధిలోని కొల్లాపురవ్ము ఆలయుం సమీపంలో ఉన్న ఇస్కాన్ వంటశాలను సోమవారం వెంకటరెడ్డి, తహశీల్దార్ రాజగోపాల్, ఎంపీడీవో హుర్మత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ భోజనం తయారీలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు.

అధికారులు వంటశాల ఇన్‌చార్జి పీజీ.దాసుతో మాట్లాడడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కిరణ్‌కువూర్‌రెడ్డి ప్రాతి నిథ్యం వహిస్తున్న పీలేరు, కలికిరి, వుంత్రి గల్లా అరుణకువూరి నియోజకవర్గం పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం వుండలాలకు చెందిన 14 వేల వుంది విద్యార్థులకు ఇక్కడి నుంచి వుధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం తీసుకెళుతారు.

వుధ్యాహ్నం 12 గంటలకు భోజనం వడ్డించాల్సి ఉండగా, తెల్లవారు జా వుు 3 గంటలకు తయూరు చేసి, ఉదయుం 8 గంటలకు వాహనాల్లో తరలిస్తారు. మధ్యాహ్నం వడ్డిస్తుండడంతో అన్నం మెత్తబడిపోతోంది. కొన్ని సందర్భాల్లో అన్నం ఉడకడం లేదు. ముద్దకడుతోంది. దాన్ని తినలేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్టీమ్‌లో వంట చేసేటప్పుడు వంద కేజీల బియ్యుం ఉడకాలంటే 20 నుంచి 30 నిమిషాలు వ్యవధి పడుతుంది. ఇందులో ఒక్క నిముషం ఆ లస్యమైనా అన్నం వుుద్ద కడుతుంది.

వుుందుగా  అరుుతే బియ్యుం ఉడకవు. చిన్నచిన్న పొరబాట్లు మినహా అన్నం బాగా వస్తోందని పీజీ. దాసు అధికారుల దృష్టికి తెచ్చారు. అధికారులు చిన్నగొట్టిగల్లు హైస్కూల్‌కు చేరుకుని విద్యార్థులను విచారించారు. ఎక్కువ శాతం వుంది విద్యార్థులు తాము భోజనం తినడం లేదని చెప్పారు. హాస్టల్ విద్యార్థులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో తినాల్సి వస్తోందని చెప్పారు. నివేదిక తయారు చేసి, కలెక్టర్‌కు పంపుతామని అధికారుల బృందం పేర్కొంది.
 
 అన్నం తింటే కడుపునొప్పి వస్తుంది
 పాఠశాలలో వుధ్యాహ్న భోజనం తింటే కడుపునొప్పి వస్తుంది. వురుగుదొడ్డికి వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అందుకని భోజనం తినడం లేదు.
 -భార్గవ్‌రెడ్డి, 7వ తరగతి
 
 అన్నం ఉడకదు, కూరలు బాగుండవు
 ఉడకని అన్నం, నీళ్ల సాంబారుతో అన్నం తినలేకపోతున్నాం. ఒకవేళ తినాలనిపించినా అన్నం చూస్తే తినలేం. నీళ్లలో కలుపుకుని తిన్నట్లు ఉం టుంది.                   

-అనిల్‌కువూర్, 6వ తరగతి
 
 ఇంటి నుంచి క్యారీ తెచ్చుకుంటాను
 స్కూల్లో పెట్టే భోజనం ఒక రోజు బియ్యుంగా ఉంటుంది. ఒక్క రోజు వుుద్ద కట్టి ఉంటుంది. విధి లేక ఇంటి దగ్గర నుంచి క్యారీ తెచ్చుకుని తింటున్నాను.      

 -మేఘన, 9వ తరగతి
 
 వుధ్యాహ్నం కూడా హాస్టల్‌లో భోజనం పెట్టాలి
 ఇస్కాన్ భోజనం కంటే వూ హాస్టల్ భోజనం బాగుంటుంది.  వుధ్యాహ్నం హాస్టల్‌లోనే భోజ నం పెట్టాలి. విధిలేక ఇస్కాన్ భోజనం తినాల్సి వస్తుంది. -సారుుశ్రీనివాస్, 9వ తరగతి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement