The final list
-
ప్రకటనే తరువాయి
నామినేటెడ్ పోస్టుల తుది జాబితా రాహుల్ గాంధీకి అందజేత ఎంపికైన వారికి నేరుగా నియామక పత్రాలు అందజేస్తామన్న సీఎం సిద్ధరామయ్య పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ అంబరీష్ వర్గం ఆరోపణలు బెంగళూరు : చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిందేనని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు జీ పరమేశ్వర్లు తాము సిద్ధం చేసిన తుది జాబితాతో శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో సిద్ధరామయ్య, పరమేశ్వర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబితాను పరిశీలించిన దిగ్విజయ్ సింగ్ జాబితాను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అందజేయాల్సిందిగా సూచించారు. దీంతో సిద్ధరామయ్య, పరమేశ్వర్లు శుక్రవారం సాయంత్రం రాహుల్‌గాంధీని కలుసుకొని జాబితాను అందజేశారు. ఇక ఈ జాబితాను పరిశీలించిన రాహుల్‌గాంధీ అనంతరం ఈ జాబితాను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. తుది జాబితాలో స్వల్ప మార్పులతో జాబితాకు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఇక ఈ జాబితాలో ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం కల్పించరాదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొంత మంది ఎమ్మెల్యేల పేర్లను సిద్ధరామయ్య, పరమేశ్వర్లు జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ విషయంపై హైకమాండ్‌కు నచ్చజెప్పి తాము సూచించిన పేర్లతో కలిసి మొత్తం 80 మంది పేర్లతో కూడిన జాబితాకు ఆమోదాన్ని అందుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేరుగా నియామక పత్రాలు ఇక నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వారి పేర్లకు పార్టీ హైకమాండ్ నుంచి ఆమోదం లభించినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ...‘నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబితాకు ఆమోదం లభించింది. ఈ జాబితాలోని వారికి ఫోన్ చేసి విషయాన్ని తెలియజెప్పడంతో పాటు వారికి నేరుగా నియామక పత్రాలను అందజేస్తాం’ అని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక ప్రకటనను వెలువరిస్తే, పార్టీలోని ఇతర వ్యక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందనే పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితా ఆలస్యంగా కనుక బయటికి వస్తే అసంతృప్తులను ఏదో ఓ విధంగా బుజ్జగించి వారిని దారిలోకి తెచ్చుకోవచ్చని సిద్ధరామయ్య, పరమేశ్వర్ భావిస్తున్నట్లు సమాచారం. మాకు అన్యాయం జరిగింది.... నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని అంబరీష్ వర్గానికి చెందిన నేతలు విమర్శిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎక్కువగా ఎస్ఎం కృష్ణ వర్గానికే ప్రాధాన్యం కల్పించారని విమర్శిస్తూ మండ్య ప్రాంతానికి చెందిన కొందరు కార్యకర్తలు శుక్రవారమిక్కడ మంత్రి అంబరీష్‌ని ఆయన నివాసంలో కలిశారు. ‘పార్టీ కోసం ఇన్నాళ్లూ మేమూ శ్రమించాం. అయితే పదవుల విషయంలో మాత్రం మాకు అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో మీరు కలగజేసుకొని మాకు న్యాయం చేయండి’ అని వారు అంబరీష్‌ని కోరారు. ఈ అంశంపై మంత్రి అంబరీష్ స్పందిస్తూ...‘నేను నా అనుచరులకే పదవులు ఇవ్వమని కోరడం లేదు. పార్టీ కోసం నిజంగా శ్రమించిన వారిని మాత్రం తప్పక గుర్తించాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం’ అని పేర్కొన్నారు. -
ఓటరు సందడి..!
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో ఓటరు సందడి మొదలు కానుంది. కొత్తగా యువతీ, యువకులు తమ ఓటును జాబితాలో నమోదు చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫొటో ఓటర్ల తుది జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులు. ఈ నెల 13 నుంచి డిసెంబర్ 8 వరకు అర్హులైన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 8 వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో దాదాపు లక్ష మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అధికారులు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా ఆర్డీవోలకు అందజేసి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం వరకు కొన్ని మండలాలకు ముసాయిదా ఓటరు జాబితాలు అందాయి. నమోదు కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను సైతం నిర్వహించి లక్ష్యం చేరుకోనున్నారు. 2,257 పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలో మొత్తం 2,257 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు నమోదు ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ కేంద్రాలతోపాటు తహశీల్దార్, ఆర్డీవో, మున్సిపాలిటీ, మీ సేవలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 19న, 26న గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రకటించిన అనంతరం అన్ని గ్రామాల్లో జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పులు, తొలగింపులు, తప్పొప్పులను సరి చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రాామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాగా, సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 226 పోలింగ్ కేంద్రాలు ఉండగా, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 190, మంచిర్యాలలో 245, అసిఫాబాద్‌లో 254, ఖానాపూర్‌లో 218, ఆదిలాబాద్‌లో 230, బోథ్‌లో 223, నిర్మల్‌లో 222, ముథోల్‌లో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. షెడ్యూల్ ఇదీ.. ఈ నెల 13న ముసాయిదా ఫొటో ఓటరు జాబితా విడుదల ఈ నెల 13 నుంచి డిసెంబర్ 8 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగనుంది. ఇందులో కొత్తగా, మార్పులు, చేర్పులు, తొలగింపులు, తదితర వాటి కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 19న, 26న గ్రామ పంచాయతీలలో, సభలలో ఓటర్ల జాబితా ప్రకటించడం. అనంతరం ఓటర్ల జాబితా చదివి విన్పించడం. చదివిన ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నట్లైతే.. పేరుండి ఫొటో లేనట్లైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 16న, 23న, 30న, డిసెంబర్ 7న నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తారు. నమోదు ప్రక్రియ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి, తప్పొప్పులను సరి చేసిన అనంతరం తయారు చేసిన ఓటరు జాబితాను డిసెంబర్ 22న ప్రకటిస్తారు. 2015 జనవరి 5లోగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కొత్త ఓటర్ల వివరాలను అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన నెల రోజులలోపు సంబంధిత ఓటరుకు ఎన్నికల కమీషన్ నుంచి ఓటరు గుర్తింపు కార్డు రానుంది. 2015 జనవరి 15న తుది జాబితాను విడుదల చేస్తారు. -
యువ..హో
ఎన్నికల వేళ ఎన్నెన్నో సిత్రాలు కనిపిస్తుంటాయి. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఫీట్లు చేస్తూ నానా తిప్పలు పడుతుంటారు. వృద్ధులనైతే మంచంతో సహా ఎత్తుకొని పోలింగ్ బూత్లవరకు తీసుకెళ్లి.. తమకిష్టం వచ్చినట్లు ఓట్లు వేయించుకుంటుంటారు. పేదలను కూడా రకరకాల ప్రలోభాలకు గురిచేస్తారు. మాటల మంత్రం వేస్తారు. మేజిక్కులతో జిమ్మిక్కులు వేస్తారు. అయితే ఈ దఫా నేతల పప్పులుడికేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఓటర్ల జాబితాలో యువశక్తి ఉరకలేస్తోంది. 20 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటనున్నారు. తుది జాబితా చూసిన నాయకులు వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలో ఎత్తులు వేస్తున్నారు. కానీ వారంతా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరైతే తమ భవితకు భరోసా కల్పిస్తారో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తారో.. ఉద్యోగభద్రత కల్పిస్తారో వారికే తమ మద్దతని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. జిల్లాలో 24,84,109 మంది ఓటర్లుండగా 20 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉన్నవారు 12, 85,438 మందిగా నమోదయ్యారు. అంటే జిల్లాలోని మొత్తం ఓటర్లలో సగం మంది యువకులే గెలుపోటములు నిర్దేశించనున్నారన్నమాట. - న్యూస్‌లైన్, ఒంగోలు కలెక్టరేట్ -
వుధ్యాహ్న భోజనం ఇలాగేనా?
భాకరాపేట, న్యూస్‌లైన్: చిన్నగొట్టిగల్లు వుండల కేంద్రంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వుధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై మండల ప్రత్యేకాధికారి, జిల్లా హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగన్నగారిగడ్డ గ్రావు పరిధిలోని కొల్లాపురవ్ము ఆలయుం సమీపంలో ఉన్న ఇస్కాన్ వంటశాలను సోమవారం వెంకటరెడ్డి, తహశీల్దార్ రాజగోపాల్, ఎంపీడీవో హుర్మత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ భోజనం తయారీలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు వంటశాల ఇన్చార్జి పీజీ.దాసుతో మాట్లాడడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కిరణ్‌కువూర్‌రెడ్డి ప్రాతి నిథ్యం వహిస్తున్న పీలేరు, కలికిరి, వుంత్రి గల్లా అరుణకువూరి నియోజకవర్గం పరిధిలోని చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం వుండలాలకు చెందిన 14 వేల వుంది విద్యార్థులకు ఇక్కడి నుంచి వుధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు భోజనం తీసుకెళుతారు. వుధ్యాహ్నం 12 గంటలకు భోజనం వడ్డించాల్సి ఉండగా, తెల్లవారు జా వుు 3 గంటలకు తయూరు చేసి, ఉదయుం 8 గంటలకు వాహనాల్లో తరలిస్తారు. మధ్యాహ్నం వడ్డిస్తుండడంతో అన్నం మెత్తబడిపోతోంది. కొన్ని సందర్భాల్లో అన్నం ఉడకడం లేదు. ముద్దకడుతోంది. దాన్ని తినలేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్టీమ్‌లో వంట చేసేటప్పుడు వంద కేజీల బియ్యుం ఉడకాలంటే 20 నుంచి 30 నిమిషాలు వ్యవధి పడుతుంది. ఇందులో ఒక్క నిముషం ఆ లస్యమైనా అన్నం వుుద్ద కడుతుంది. వుుందుగా అరుుతే బియ్యుం ఉడకవు. చిన్నచిన్న పొరబాట్లు మినహా అన్నం బాగా వస్తోందని పీజీ. దాసు అధికారుల దృష్టికి తెచ్చారు. అధికారులు చిన్నగొట్టిగల్లు హైస్కూల్‌కు చేరుకుని విద్యార్థులను విచారించారు. ఎక్కువ శాతం వుంది విద్యార్థులు తాము భోజనం తినడం లేదని చెప్పారు. హాస్టల్ విద్యార్థులు మాత్రం విధి లేని పరిస్థితుల్లో తినాల్సి వస్తోందని చెప్పారు. నివేదిక తయారు చేసి, కలెక్టర్‌కు పంపుతామని అధికారుల బృందం పేర్కొంది. అన్నం తింటే కడుపునొప్పి వస్తుంది పాఠశాలలో వుధ్యాహ్న భోజనం తింటే కడుపునొప్పి వస్తుంది. వురుగుదొడ్డికి వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అందుకని భోజనం తినడం లేదు. -భార్గవ్‌రెడ్డి, 7వ తరగతి అన్నం ఉడకదు, కూరలు బాగుండవు ఉడకని అన్నం, నీళ్ల సాంబారుతో అన్నం తినలేకపోతున్నాం. ఒకవేళ తినాలనిపించినా అన్నం చూస్తే తినలేం. నీళ్లలో కలుపుకుని తిన్నట్లు ఉం టుంది. -అనిల్‌కువూర్, 6వ తరగతి ఇంటి నుంచి క్యారీ తెచ్చుకుంటాను స్కూల్లో పెట్టే భోజనం ఒక రోజు బియ్యుంగా ఉంటుంది. ఒక్క రోజు వుుద్ద కట్టి ఉంటుంది. విధి లేక ఇంటి దగ్గర నుంచి క్యారీ తెచ్చుకుని తింటున్నాను. -మేఘన, 9వ తరగతి వుధ్యాహ్నం కూడా హాస్టల్లో భోజనం పెట్టాలి ఇస్కాన్ భోజనం కంటే వూ హాస్టల్ భోజనం బాగుంటుంది. వుధ్యాహ్నం హాస్టల్లోనే భోజ నం పెట్టాలి. విధిలేక ఇస్కాన్ భోజనం తినాల్సి వస్తుంది. -సారుుశ్రీనివాస్, 9వ తరగతి