ఎన్నికల వేళ ఎన్నెన్నో సిత్రాలు కనిపిస్తుంటాయి. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఫీట్లు చేస్తూ నానా తిప్పలు పడుతుంటారు. వృద్ధులనైతే మంచంతో సహా ఎత్తుకొని పోలింగ్ బూత్‌లవరకు తీసుకెళ్లి.. తమకిష్టం వచ్చినట్లు ఓట్లు వేయించుకుంటుంటారు. పేదలను కూడా రకరకాల ప్రలోభాలకు గురిచేస్తారు. మాటల మంత్రం వేస్తారు. మేజిక్కులతో జిమ్మిక్కులు వేస్తారు. అయితే ఈ దఫా నేతల పప్పులుడికేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఓటర్ల జాబితాలో యువశక్తి ఉరకలేస్తోంది. 20 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటనున్నారు.
తుది జాబితా చూసిన నాయకులు వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలో ఎత్తులు వేస్తున్నారు. కానీ వారంతా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరైతే తమ భవితకు భరోసా కల్పిస్తారో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తారో.. ఉద్యోగభద్రత కల్పిస్తారో వారికే తమ మద్దతని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. జిల్లాలో 24,84,109 మంది ఓటర్లుండగా 20 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉన్నవారు 12, 85,438 మందిగా నమోదయ్యారు. అంటే జిల్లాలోని మొత్తం ఓటర్లలో సగం మంది యువకులే గెలుపోటములు నిర్దేశించనున్నారన్నమాట. - న్యూస్‌లైన్, ఒంగోలు కలెక్టరేట్
యువ..హో
Published Thu, May 1 2014 3:04 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement