సమైక్యాంధ్రకు జైకొట్టిన తర్వాతే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేయాలని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి స్పష్టం చేశారు.
అనంతపురం : సమైక్యాంధ్రకు జైకొట్టిన తర్వాతే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేయాలని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు లేఖ ఆధారంగానే సోనియా రాష్ట్రాన్ని విభజించారని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన న్యాయవాదులను గుర్నాథరెడ్డి శనివారం పరామర్శించారు
మరోవైపు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. చేతిలో పూలు పట్టుకుని సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలంటూ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రుయా ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. విభజన ప్రకటనతో ప్రజలందరిని ఆందోళనకు గురి చేశారని ఉద్యోగులు మండిపడ్డారు. విభజన ప్రకటనని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.