గాజువాక: విశాఖపట్టణం నగరం గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి టన్నుకు పైగా చౌక బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గాజువాక ప్రాంతంలోని ఓ ఇంట్లో మొత్తం 21 సంచుల్లో 50 కిలోల చొప్పున ఉన్న 1050 కిలోల బియ్యాన్ని వాహనంలోకి ఎక్కిస్తుండగా గస్తీ పోలీసులు గుర్తించారు. ఆ బియ్యాన్ని సీజ్ చేసి, అందుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, అధికారులంతా ముఖ్యమంత్రి పర్యటన కారణంగా బిజీగా ఉండటంతో మంగళవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.