శ్రీలంకలో విశాఖపట్నంకు చెందిన దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
విశాఖపట్నం/కొలంబొ: శ్రీలంకలో విశాఖపట్నంకు చెందిన దంపతులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతులు గాజువాక సమీపంలోని శ్రీనగర్ కు చెందిన బొబ్బా పృథ్విరామ్, ఆయన భార్య నాగపోయిన మహలక్ష్మిగా గుర్తించారు. ఈ మేరకు గాజువాక పోలీసులు పృథ్విరామ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
కొలంబొలోని వెలవెట్టా పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం పృథ్వి, మహాలక్ష్మి మృతదేహాలను కనుగొన్నారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పృథ్విరామ్ మలేసియాలో ఫైనాన్స్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా, మరేదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.