ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్ సిగ్నల్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గాజువాక: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్ సిగ్నల్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు కార్మికులు సైకిళ్లపై వెళుతుండగా హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఓ కార్మికుడిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు ఒడిస్సా కు చెందిన వాడిగా గుర్తించారు.