సాక్షి,విశాఖపట్నం (గాజువాక) : జీవనమృతుడిగా మారిన వ్యక్తి అవయవాలు దానం చేసి....ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. నాతయ్యపాలేనికి చెందిన భూపతి కిరణ్ కుమార్ (26) ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నాటి నుంచి వైద్యానికి స్పందించకపోవడంతో శనివారం బ్రెయిన్ డెడ్‌గా వైద్యుడు కిరణ్ కుమార్ నిర్థారించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందిన దుఃఖంలోనూ ఆ కటుంబం కన్నీళ్లను అదిమిపెట్టుకుని గొప్ప మనసు చాటుకుంది.
తన కుమారిడి అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో వైద్యులు, బంధువులు బాధిత కుటుంబాన్ని అభినందించారు. మృతుడు భూపతి కిరణ్ కుమార్ నేవల్ అర్మెంట్ డిపోలో టీఎఫ్ (ఎస్‌కే)గా పనిచేస్తున్నాడని, తండ్రి భూపతి కృష్ణ (ఈ మధ్యనే బెహ్రాన్‌లో పనిచేస్తూ తన స్వస్థలానికి వచ్చారు), తల్లి రమణమ్మ (గృహిణి), సోదరి మాధురి (ఎన్‌ఏడీ ఉద్యోగి) ఉన్నారని బంధువులు తెలిపారు. అంతటి దుఃఖంలోనూ కుమారుడి అవయవాలు దానం చేసేందుకు కృష్ణ, రమణమ్మ ముందుకొచ్చారు. దీని కి సంబంధించి అంగీకార పత్రాన్ని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి యాజమాన్యానికి అందజేశారు.
ఇద్దరికి అమర్చనున్న వైద్యులు
కిరణ్ కుమార్‌కు చెందిన హార్ట్, లంగ్స్ పార్ట్‌లను హైదరాబాద్‌లోని ఓ రోగికి అమర్చేందుకు తరలించారు. అలాగే కిడ్నీ, లీవర్‌లను కిమ్స్ ఐకాన్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అమర్చనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment