విశాఖలో అగ్నిప్రమాదం; రెండు థియేటర్లు దగ్ధం | Fire Accident In Kanya Sri Kanya Theatre | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 17 2018 10:44 AM | Last Updated on Mon, Sep 17 2018 11:51 AM

Fire Accident In Kanya Sri Kanya Theatre - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గాజువాకలోని కన్య, శ్రీకన్య సినిమా హాల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జంట థియేటర్లలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో రెండు థియేటర్లు పూర్తిగా తగలబడిపోయాయి. ఆరు ఫైర్‌ ఇంజన్లతో అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని ఫైర్‌ సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. థియేటర్‌పైన సెల్‌ టవర్స్‌ కూడా ఉండటంతో వారు మరింత భయాందోళన చెందారు. అక్కడికి చేరుకున్న అధికారులు తొలుత నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement