సాక్షి, విశాఖపట్నం : గాజువాక రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడిన ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మొదలవలస కృష్ణరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తనకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగుల అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గాజువాక రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి విజయ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధుర వలస కృష్ణారావు అనే ఈ డాక్యుమెంట్ రైటర్ గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బందిని బెదిరించి తనకు త్వరితగతిన పనులు చేసుకునే రకంగా ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. (సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:)
తాజాగా తనను కూడా కులం పేరిట దూషించినట్లు విజయ పేర్కొంది. తనను మాత్రమే కాకుండా కార్యాలయంలోని పలువురిని కృష్ణారావు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు డాక్యుమెంట్ రైటర్ కృష్ణారావును అరెస్టు చేసి అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులు, అక్రమార్జన తదితర ఆరోపణల మేరకు కృష్ణారావుపై విచారణ కొనసాగిస్తామని డీసీపీ క్రైమ్ వి. సురేష్ బాబు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడిన కృష్ణ రావు అరెస్టు పట్ల ప్రజా సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాకగత కొన్నేళ్లుగా గాజువాక కేంద్రంగా అతను భారీగా అక్రమార్జన చేశారని దీనిపై కూడా లోతుగా విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.(‘వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించం’)
Comments
Please login to add a commentAdd a comment