Document Writer
-
విశాఖలో డాక్యుమెంట్ రైటర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : గాజువాక రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడిన ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ మొదలవలస కృష్ణరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తనకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగుల అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గాజువాక రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి విజయ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధుర వలస కృష్ణారావు అనే ఈ డాక్యుమెంట్ రైటర్ గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బందిని బెదిరించి తనకు త్వరితగతిన పనులు చేసుకునే రకంగా ఒత్తిడి చేసినట్లు ఆరోపించింది. (సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:) తాజాగా తనను కూడా కులం పేరిట దూషించినట్లు విజయ పేర్కొంది. తనను మాత్రమే కాకుండా కార్యాలయంలోని పలువురిని కృష్ణారావు బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు డాక్యుమెంట్ రైటర్ కృష్ణారావును అరెస్టు చేసి అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగులపై బెదిరింపులు, అక్రమార్జన తదితర ఆరోపణల మేరకు కృష్ణారావుపై విచారణ కొనసాగిస్తామని డీసీపీ క్రైమ్ వి. సురేష్ బాబు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడిన కృష్ణ రావు అరెస్టు పట్ల ప్రజా సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాకగత కొన్నేళ్లుగా గాజువాక కేంద్రంగా అతను భారీగా అక్రమార్జన చేశారని దీనిపై కూడా లోతుగా విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.(‘వారికి అన్యాయం జరిగితే ఉపేక్షించం’) -
దస్తావేజు లేఖరులకు లైసెన్స్!
అక్రమాల నియంత్రణ కోసం రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కుంభకోణాలకు నిలయంగా మారిన రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్లలో కీలకమైన దస్తావేజులను రాసే బాధ్యతలను అర్హత కలిగిన వ్యక్తులకు అప్పగించాలని... దస్తావేజు లేఖరు ల (డాక్యుమెంట్ రైటర్)కు లైసెన్సులు ఇవ్వడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. వాస్తవానికి 2000 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖలో లైసెన్స్డ్ దస్తావేజుల లేఖరులు ఉండేవారు. ఆ తర్వాత ‘కార్డ్ (కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’విధానాన్ని ప్రవేశపెట్టడం తో అప్పటి ప్రభుత్వం దస్తావేజు లేఖరులను తొలగించింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో దళారులకు మంచి అవకాశంగా మారింది. దళారులు డబ్బు ఆశ చూపుతుండడంతో కొందరు సబ్రిజిస్ట్రార్లు భారీ స్థాయిలో అక్రమాలకు వెనుకాడటంలేదు. మూడు వేల మందికి అవకాశం... అర్హత కలిగిన వారికి దస్తావేజు లేఖరులుగా లైసెన్స్ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సుమారు 3వేల మంది నిరుద్యోగులకు అవకాశం లభించవచ్చని అంచనా. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా... ఒక్కొక్క కార్యాలయానికి కనీసం 15 మంది చొప్పున నియమించాల ని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కనీస అర్హత డిగ్రీ కాగా.. న్యాయశాస్త్రం (లా) అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయానికి వచ్చింది. దస్తావేజు రాసినందుకు రూ.10లక్షలలోపు విలువైన డాక్యుమెం ట్‌కు రూ.1,000, రూ.50 లక్షలలోపు రూ.2,000 చొప్పున లేఖరులకు ఫీజు చెల్లించే వీలు కల్పిస్తున్నా రు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్లలో జరిగే తప్పిదాలకు వారిని కూడా బాధ్యులుగా పరిగణించాలని భావిస్తున్నారు. సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధం రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల 72 మంది సబ్ రిజి స్ట్రార్లను బదిలీ చేసిన ప్రభుత్వం... తాజాగా ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న జూనియర్, సీనియర్ అసి స్టెంట్లను, అటెండర్లను బదిలీ చేయాలని నిర్ణయిం చింది. తొలిదశలో క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేసి... ఆపై జిల్లా రిజిస్ట్రార్ల బదిలీలను కూడా చేపట్టా లని గురువారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 196 మంది సీనియర్ అసిస్టెంట్లు, 380 మంది జూనియర్ అసిస్టెంట్లు, 190 మంది అటెండర్లు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉండగా... కాంట్రాక్టు పద్ధతిన మరో వంద మంది కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. -
డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘటన పరుగులు తీసిన జనం లొంగిపోయిన నిందితుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు, స్థల క్రయ, విక్రయదారులు, అధికారులు, సిబ్బంది అందరూ చూస్తుండగానే డాక్యుమెంట్ రైటర్‌పై ఓ వ్యక్తి మారణాయుధంతో హత్యాయత్నం చేశాడు.ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మడకశిరలో సంచలనం రేపింది. మడకశిరకు చెందిన అతావుల్లా (52) కొన్నేళ్లుగా డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న ఇతనిపై బసవరాజు అనే వ్యక్తి పదునైన కొడవలితో తలపై దాడి చేశాడు. అక్కడున్న కొంతమంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అతావుల్లాను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. భూముల డాక్యుమెంట్ తయారు చేసే విషయంలో తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే నిందితుడు దాడి చేసినట్లు చెప్పారు. లొంగిపోయిన నిందితుడు హత్యాయత్నం చేసిన తర్వాత నిందితుడు బసవరాజు పోలీస్‌స్టేçÙన్లో లొంగిపోయాడు. తనకు డాక్యుమెంట్ రైటర్ అన్యాయం చేయడంతోనే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం అందుకున్న వందలాది మంది ప్రజలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సంఘటనపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, గుడిబండ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితర ప్రముఖులు కూడా అతావుల్లాను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి మెడికల్ ఆఫీసర్ మంజువాణి, డాక్టర్ బాబాబుడేన్ ఎమ్మెల్సీకి వివరించారు.