అగనంపూడి (గాజువాక): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చేసిన యత్నాలను ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 228లోని రెండెకరాల స్థలాన్ని గతంలో ఫార్మా సిటీ నిర్వాసితుల కోసం కేటాయించారు.
ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వాసితులకు స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే అదునుగా భావించిన ఆ వార్డుకు చెందిన టీడీపీ నేతలు సదరు స్థలంలో రాత్రికి రాత్రే దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల పేరుతో సదరు స్థలాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని కుట్ర పన్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గాజువాక రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు ఆక్రమిత స్థలాన్ని సందర్శించి సిమెంట్ దిమ్మలను నేలమట్టం చేశారు. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment