Land occupation
-
ఏపీఐఐసీ స్థలంపై టీడీపీ నేతల కన్ను.. రాత్రికి రాత్రే..
అగనంపూడి (గాజువాక): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చేసిన యత్నాలను ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగనంపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 228లోని రెండెకరాల స్థలాన్ని గతంలో ఫార్మా సిటీ నిర్వాసితుల కోసం కేటాయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వాసితులకు స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే అదునుగా భావించిన ఆ వార్డుకు చెందిన టీడీపీ నేతలు సదరు స్థలంలో రాత్రికి రాత్రే దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాల పేరుతో సదరు స్థలాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని కుట్ర పన్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గాజువాక రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు ఆక్రమిత స్థలాన్ని సందర్శించి సిమెంట్ దిమ్మలను నేలమట్టం చేశారు. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత హెచ్చరించారు. -
టీడీపీకి ఓటు వేయనందుకు దళితులపై కక్ష
సాక్షి,కడప(రాజంపేట రూరల్) : తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దళితులపై కొల్లావారిపల్లి గ్రామపంచాయతీసర్పంచ్ ఎం.మహేష్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా కొల్లావారిపల్లిలోని మిట్ట హరిజనవాడలో పాగా వేసేందుకు పావులు కదిపాడు. 20 ఏళ్ల క్రితం తాగు నీటి కోసం 400 అడుగులు వేసినా నీరు పడకపోవడంతో వదిలేసిన బోరును తిరిగి మరమ్మతులు చేయిస్తానని ముందుకు వచ్చాడు. ఇక్కడే మోటారు బిగించి నీటిని అందిస్తానని పట్టుబట్టాడు. ఇది అంతా గ్రామ ప్రజలపై ప్రేమతో కాదు. ఆ గ్రామంపై పట్టు సాధించేందుకు చేసిన యత్నం. మండల పరిధిలోని కొల్లావారిపల్లి గ్రామ పంచాయతీకి ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో మిట్ట హరిజనవాడకు చెందిన దళిత అభ్యర్థి మహేష్ టీడీపీ తరఫున పోటీ చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో మిట్ట హరిజనవాడ ఓట్లు కీలకంగా మారాయి. ఎప్పుడూ వైఎస్సార్ కుటుంబం వెన్నంటే.. ఈ గ్రామంలోని దళితులు ఎప్పుడూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం వెంటే నడిచేవారు. కమ్మ సామాజిక వర్గానికి పట్టు ఉన్న కొల్లావారిపల్లిలో వైఎస్సార్ సానుభూతి పరుల మీద ఎప్పుడూ కక్షసాధింపు చర్యలు కొనసాగేవి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకి చెందిన కొల్లావారిపల్లి సర్పంచ్ మహేష్ గ్రామ సర్వే నంబరు–25లోని టి.నరసింహులుకు సంబంధించిన ఇంటిస్థలాన్ని ప్రభుత్వం పేరుతో స్వాధీనం చేసుకునేందుకు వేసిన స్కెచ్‌లో భాగంగా ఎవరి అనుమతులు లేకుండానే బోరును రీ పాయింట్ చేసేందుకు పూనుకున్నాడు. అడ్డుకున్న మిట్ట హరిజనవాడ ప్రజలను ‘మీకు చేతనైంది చేసుకోపోండని’ సవాల్ విసిరాడు. జగనన్న పాలనలో నీటి ఎద్దడి లేదు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించినప్పటి నుంచి పుష్కలంగా వర్షాలు కురవడంతో ఈ రెండున్నరేళ్ల కాలంలో గ్రామంలో నీటి ఎద్దడి లేదు. గతంలో 800 అడుగుల ఉన్న బోరును సంవత్సరం క్రితం రీ బోర్ చేయించి 1150 అడుగుల లోతుకు చేశారు. నీటి అవసరం లేకున్నా బోరును వేయించి ఒకే పైపునకు రెండు మోటార్లకు చెందిన నీటిని వదిలితే పైపులు పగిలిపోతాయని తెలిసినా సర్పంచ్ ఇటువంటి పనులు చేయడం సరికాదని వారు అంటున్నారు. తక్షణమే బోరును వేయకుండా నిలుపుదల చేయాలని మిట్ట హరిజనవాడ గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు. గ్రామస్తులు గురువారం ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్ దృష్టికి తీసుకెళ్లేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అయితే సబ్ కలెక్టర్ క్యాంప్ లేకపోవడంతో తిరిగి శుక్రవారం వస్తామని వెళ్లిపోయారు. చదవండి: కాపలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు! -
వెలుగు చూస్తున్న అక్రమ ‘ఆమోదాలు’.. ఆంధ్రజ్యోతికి
వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ అడిగినా.. ఎన్నిసార్లు అడిగినా భూ పందేరాలు ఇష్టారాజ్యంగా జరిగిపోతాయనేందుకు ఆమోద పబ్లికేషన్స్‌కు విలువైన స్థలాన్ని కట్టబెట్టడమే ప్రబల నిదర్శనం. తెల్లారి లేచింది మొదలు పాఠకులకు అదేపనిగా నీతులు చెప్పే ఓ తోక పత్రిక నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా భూమి కొట్టేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు హయాంలో కోరిన చోట కోరుకున్న ధరకు రూ.కోట్ల విలువైన భూమిని కారుచౌకగా దక్కించుకున్న వైనానికి ముందు జరిగిన ఓ తతంగం ఇప్పుడు చర్చకు తెరలేపింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామంలో బీసీ వర్గాల రైతులకు నిర్దేశించిన భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోద పబ్లికేషన్స్‌కు అతి తక్కువ ధరకు కేటాయించింది. ఈ విషయమై ‘అక్రమ ఆమోదం’ పేరిట బుధవారం ‘సాక్షి’లో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కలకలం రేపిన ఈ కథనం నేపథ్యంలో సదరు సంస్థ గతంలో వెలగబెట్టిన భూ నిర్వాకం ఇప్పుడు బయటికొచ్చింది. ►రేణిగుంట ఎస్టేట్‌లో వివిధ పరిశ్రల కోసం ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) 1983లో ఓ వెంచర్‌ను నెలకొల్పింది. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రింటర్స్ పేరిట ఉన్న అప్పటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి 1986 మే 6న ఎర్రంరెడ్డిపాలెం సర్వే నంబర్ 516లో 1.50 ఎకరాలను 1, 2, 3, 4 ప్లాట్లుగా కేటాయించింది. ►ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం సంస్థకు లేదా పరిశ్రమకు కేటాయించిన భూములను విక్రయించడానికి వీల్లేదు. ఒకవేళ సదరు సంస్థకు నష్టం వస్తే ఆ భూమిని తిరిగి ఏపీఐఐసీకే అప్పగించాలి. లేనిపక్షంలో ఏపీఐఐసీ నుంచి ఎన్ఓసీ తీసుకుని భూ బదలాయింపు చేసుకోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఆంధ్ర ప్రింటర్స్ నుంచి పత్రికను కొనుగోలు చేసిన ప్రస్తుత ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎవరి అనుమతి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రూ.3కోట్లకు విక్రయించేసుకుంది. కనీసం ఏపీఐఐసీ దృష్టికి తీసుకెళ్లకుండా, ఎన్ఓసీ లేకుండానే అమ్మేసుకున్నట్లు సమాచారం. మళ్లీ 2015లో భూ పందేరం నిబంధనల ప్రకారం ఓ సంస్థకు ఒకేసారి భూ కేటాయింపులు జరపాలి. అయితే చంద్రబాబు తాబేదారుగా వ్యవహరించే సదరు తోక పత్రికకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ.. ఎలా కావాలంటే అలా భూ పందేరం జరిగిపోయింది. 2015లో తూకివాకం వద్ద ఆమోద పబ్లికేషన్ పేరుతో మరోసారి విలువైన భూములు కొట్టేసిన సంగతి తెలిసిందే. -
గుట్టకాయ స్వాహా..
అధికారంలో ఉన్నన్నాళ్లూ కబ్జాలు, సెటిల్మెంట్లతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం మారినా తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీటిపై యంత్రాంగం దృష్టి సారించడంతో.. వారికన్ను గుట్టలు, కుంటలపై పడింది. వాటిని ఇష్టానుసారం తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా చంద్రగిరిలోని పత్తి గుట్ట వీరి దెబ్బకు రూపురేఖలు కోల్పోతోంది. సాక్షి,చిత్తూరు(చంద్రగిరి): గత ప్రభుత్వంలో నీరు–మట్టి పథకం టీడీపీ నాయకులకు కల్పతరువుగా ఉండేది. ఈ పేరుతో వారు చెరువులను, కుంటలను కబ్జా చేయడంతో పాటు అక్కడి మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి దోపిడీకి అడ్డుకట్ట పడింది. అయితే కొన్నిచోట్ల అక్రమాలకు అలవాటు పడిన నాయకులు తమ నీచబుద్ధిని మాత్రం ఇంకా వదులుకోలేదు. గుట్ట గుటుక్కు చంద్రగిరి లెక్కదాఖల సర్వే నంబరు 1479లో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో పత్తిగుట్ట ఉంది. ఈ గుట్టలో నాణ్యమైన ఎర్రమట్టి ఉండడంతో తెలుగుదేశం నాయకుల కన్ను దీనిపై పడింది. అంతే.. గత పది రోజులుగా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ద్వారా నిర్విరామంగా మట్టిని తరలించేస్తూ లక్షలు దండుకుంటున్నారు. లోడ్ రూ.800 పత్తిగుట్టలోని మట్టిని ట్రాక్టర్ లోడ్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రగిరి పాతపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మట్టి మాఫియాగా మారి గుట్టను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారతీనగర్, ఎంజీ బ్రదర్స్ ప్లాట్లు, రెడ్డివీధితో పాటు ఇతర ప్రాంతాల్లో నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారికి ఈ మట్టిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇటుక బట్టీల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ మట్టిని తరలించేస్తున్నారు. పట్టపగలే మట్టి అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఆలస్యంగా స్పందించడం విమర్శలకు తావిస్తోంది. సాధారణ పౌరుడు గజం భూమి ఆక్రమిస్తే ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రెవెన్యూ సిబ్బంది, సుమారు ఎకరా విస్తీర్ణంలో గుట్టను పది రోజులుగా స్వాహా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం సర్వే నంబరు 1479లోని పత్తిగుట్టలో అక్రమంగా ఎకరాకు పైగా మట్టిని తరలించినట్లు తెలియడంతో ఆదివారం తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు సిబ్బందితో కలసి గుట్టను పరిశీలించారు. మట్టి అక్రమ రవాణాకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ మోహన్‌రెడ్డి, వీఆర్ఓలు నాగరాజు, అశోక్ కుమార్ ఉన్నారు. సబ్సిడీ ట్రాక్టర్ల ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందించే ట్రాక్టర్లను మట్టి తరలింపునకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆ ట్రాక్టర్లను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. ఇలాంటి అక్రమ వ్యాపారాలకు ట్రాక్టర్లను వినియోగించడమంటే ప్రభుత్వాన్ని మోసం చేయడమే అవుతుంది. సుమారు 10 ట్రాక్టర్లకు పైగా వైట్‌బోర్డు(సబ్సిడీ ట్రాక్టర్లు) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు చంద్రగిరి సమీపంలోని పత్తిగుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే జేసీబీతో పాటు ట్రాక్టర్లు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. అధికారులు వచ్చే సమయానికి ఎవ రూ లేకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. – అరుణ్, చంద్రగిరి, భారతీనగర్ ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించాలి. అక్రమంగా మట్టి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే స్థానికులందరం కలసి ధర్నాకు దిగుతాం. – భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి -
భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు సోదరుడు శంకరరావు భూకబ్జాలో కొత్త కోణం వెలుగు చూసింది. శంకరరావు తమ భూమి ఆక్రమించినట్లు పలువురు దళితులు ఫిర్యాదు చేశారు. అజయ్‌బాబు, జైన్ అనే వ్యక్తులతో కలిసి శంకరరావు దళిత భూములు ఆక్రమణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుంగలం సర్వే నంబర్ 29/1లోని ఎకరా 30 సెంట్ల స్థలంలో పల్లా శంకరరావు బెదిరించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటున్నారు దళితులు. పల్లా సోదరుడి భూ ఆక్రమణలపై అప్పటి హోంమంత్రి చినరాజప్పకు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు బాధితులు. టీడీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చదవండి: కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు -
హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ సోదరులు
సాక్షి, హైదరాబాద్ : భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని తమ భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవాలని చూస్తుందంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ వేశారు. 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. (చదవండి : బయటపడ్డ రేవంత్‌రెడ్డి అక్రమాలు: క్రిమినల్ కేసు ) ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్ సోదరుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అసలు ఏం జరిగిందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రేపటి(శుక్రవారం) వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చట్టం ప్రకారం నడచుకోవాలని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. (చదవండి : భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన! ) -
భూ వివాదంలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి
-
ఏపీ రాజధానిలో మరో భూ కుంభకోణం
-
అంతా మా ఇష్టం..!
సాక్షి, విజయనగరం(చీపురుపల్లి) : ఆయనో పెద్ద భూ స్వామి... పదుల ఎకరాల భూమి ఉంది... ఇంకా ఆయనకు భూ దాహం తీరలేదు. శ్రీకాకుళం జిల్లా నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో.. తన పొలం మధ్యలో ఉన్న గెడ్డలు, వాగులు..రస్తాలను కలిపేశారు. ఒకే పొలంగా మార్చేశారు... అందులో చక్కగా మొక్కజొన్న సాగు చేపట్టారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ గెడ్డ ఆక్రమణ పుణ్యమా అని దాదాపు 300 ఎకరాల ఆయకట్టుకు నీరందడంలేదు. గెడ్డను విడిచిపెట్టాలని భూస్వామి రైతులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్‌కు గోడు వినిపించారు. 2.69 ఎకరాల ఆక్రమణ శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలోని లింగాలవలస, వెంకటాపురానికి చెందిన టీడీపీ నేతల సమీప బంధువు కర్లాం రెవెన్యూ పరిధిలో 18 ఎకరాలు జిరాయితీ పొలాన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. ఆ జిరాయితీ పొలానికి చుట్టూ సర్వే నంబరు 302–1లో 2.41 ఎకరాల విస్తీర్ణంలోని గెడ్డ, 302–4 లో 0.28 సెంట్లు రస్తా ఉండేది. జిరాయితీ పొలం చుట్టూ ఉన్న ఈ గెడ్డ, రస్తాను భూస్వామి ఆక్రమించినట్టు గ్రామస్తులు,పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ గెడ్డ నుంచి వచ్చే నీరు పోలమ్మ చెరువుకు చేరుతుందని, ఆ చెరువు కింద 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని గ్రామ పెద్దల వాదన. అయితే, లావేరు మండలంలో ఉన్న టీడీపీ నాయకుడు తన దగ్గర నారాయణ మంత్రం ఉందని, అంతా తాను చూసుకుంటానని దగ్గరుండి కర్లాం రెవెన్యూ పరిధిలో భూములు కొనిపించి, ఆక్రమణకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు కర్లాం రెవెన్యూ పరిధిలో వాగు, రస్తా ఆక్రమణకు గురైందని, దీనివల్ల పోలమ్మ చెరువుకు నీరు సరఫరా నిలిచిపోయిందని గ్రామ పెద్దలు తహసీల్దార్ శ్యామ్సుందర్కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల 300 ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. సర్వేకు ఆదేశించాం ఇదే విషయంపై తహసీల్దార్ పి.వి.శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ కర్లాంలో గెడ్డ, రస్తా ఆక్రమణలపై ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై మండల సర్వేయర్, ఆర్ఐలకు సర్వే చేసి వాస్తవ నివేదికలను ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఆక్రమణలకు గురైనట్లు తేలితే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
రూ. 2 కోట్ల స్థలం కబ్జా!
అది గూడూరు పట్టణంలో ఎంతో విలువైన స్థలం. అక్కడ అంకణం విలువ సుమారు రూ.20 లక్షలకు పైమాటే. అలాంటి ప్రాంతంలో సుమారు 10 అంకణాలకు పైగా రూ.2 కోట్ల విలువజేసే స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏకంగా ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులిచ్చారు. సంబంధిత ఆర్అండ్బీ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి, గూడూరు: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఎదురుగా పురాతన గడియారం బిల్డింగ్ ఉండేది. అప్పట్లో వాహనాల పార్కింగ్ నిమిత్తం ఆ భవనానికి ముందుగా సుమారు 10 నుంచి 15 అంకణాల వరకూ ఆర్అండ్బీ అధికారులు స్థలాన్ని వదిలి ఉంచారు. కాలక్రమంలో ఆ గడియారం బిల్డింగ్ ఉన్న స్థలాన్ని ప్లాట్ల రూపంలో విభజించి విక్రయించారు. ఈ క్రమంలో ఆర్అండ్బీ పార్కింగ్ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తుల కన్ను పార్కింగ్ నిమిత్తం వదిలిన స్థలంపై పడింది. ఇదే అదనుగా ఆ దుకాణ సముదాయం నిర్మించే బిల్డర్, సేవ ముసుగులో అవినీతికి పాల్పడే ఎల్‌బీఎస్‌లు(లైసెన్స్డ్ బిల్డింగ్ సర్వేయర్) టౌన్ ప్లానింగ్ అధికారులతో మధ్యవర్తిత్వం నెరిపి, ఆ శాఖ అధికారులకు భవన నిర్మాణధారుల నుంచి భారీ స్థాయిలో ముడుపులు ఇప్పించారు. అలాగే ఆర్అండ్బీ శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూడకుండా వారికి కూడా నగదు ముట్టజెప్పినట్లు బిల్డర్, ఎల్‌బీఎస్‌లు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొనుగోలు చేసిన స్థలంతోపాటు కబ్జా చేసిన స్థలాన్ని కలుపుకుని భారీ స్థాయిలో దుకాణ సముదాయ నిర్మాణానికి సన్నద్ధమవుతున్నారు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణం చేపట్టే స్థలానికి ముందుకు వచ్చి కనీసం సెట్ బ్యాక్‌లకు కూడా స్థలం వదలకుండా పెద్ద పిల్లర్‌ను ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలం నాడే ముందు చూపుతో ఆ శాఖాధికారులు పార్కింగ్ అవసరాల నిమిత్తం స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీతో ఆ స్థలం కూడా సరిపోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కొద్దిపాటి స్థలాన్ని కూడా ఆర్అండ్బీ అధికారులు కాపాడుకోవాల్సి ఉంది. అయితే దర్జాగా కబ్జా చేసేస్తుంటే పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హద్దులు చూపాలని తహసీల్దార్‌ను కోరాం మా శాఖకు చెందిన పార్కింగ్ స్థలం అక్కడ ఉందని మా దృష్టికి వచ్చింది. దీంతో గతంలోనే ఆ స్థలానికి సంబంధించిన హద్దులు చూపాలని తహసీల్దార్‌ను రాత పూర్వకంగా కోరాం. కబ్జాకు గురవుతుందని తెలిసింది కాబట్టి మా స్థలాన్ని కాపాడుకునేందుకు మళ్లీ హద్దులు చూపాలని అడుగుతాం. మా స్థలంలో నిర్మాణాలు చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వివేకానంద, ఈఈ, ఆర్అండ్బీ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటాం పట్టణంలో స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. ఈ మేరకు పరిశీలిస్తున్నాం. కబ్జాకు గురైనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – ఓబులేశు, మున్సిపల్ కమిషనర్ -
సీఎం దాకా వద్దు.. మేం చేసి పెడతాం
ఇల్లెందుఅర్బన్’(భద్రాద్రి కొత్తగూడెం): ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీలో తాము భూములు కోల్పోయామని, తమకు పరిహారం ఇప్పించి న్యాయం చేయా లని కోరుతూ గురువారం నిర్వాసితుడు సుందర్‌లాల్‌పాసి తన కుటుంబ సమేతంగా ఎండ్ల బండిపై యాత్ర ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి తన సమస్యను విన్నవించుకునేందుకు హైదరాబాద్ బయలుదేరాడు. యాత్ర కారేపల్లి మండలం ఆల్యా తండాకు చేరుకునే సరికి.. సమాచారం తెలుసుకున్న ఇల్లెందు సీఐ వేణుచందర్ వారిని ఆపి.., సమస్య తెలుసుకుని కారేపల్లి తహసీల్దార్ స్వామి వద్దకు తీసుకువెళ్లారు. తహసీల్దార్ ఇల్లెందు ఏరియా సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సునీతను కారేపల్లికి పిలిపించి వారి సమక్షంలోనే చర్చించారు. నిర్వాసితుడి వద్ద గల భూపత్రాలను పరిశీలించారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తహసీల్దార్ హామీవ్వడంతో నిర్వాసితుడు తమ యాత్రను విరమిం చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుడు సుందర్‌లాల్‌పాసి మాట్లాడుతూ ఓసీ ఏర్పాటులో భాగంగా యాజమాన్యం తమకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు వల్ల నేడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. భూములకు సంబంధించిన పత్రాలన్ని ఉన్నా అధికారులు పరిహారం ఇవ్వకుండా పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. సుమారు 10 ఎకరాల భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
దత్తతన్నాడు.. దోపిడీకొచ్చాడు..!
సాక్షి, ఎర్రావారిపాళెం : విదేశాల్లో సంపాదించాను.. ఊర్లన్నీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానంటూ నమ్మబలికి మోసగించాడంటూ రైతులు ఎన్ఆర్ఐ అబ్దుల్ అలీపై తిరుగుబాటు చేస్తున్నారు. అబ్దుల్‌అలీబలవంతపు భూసేకరణపై రైతులు బుధవారం ఎర్రావారిపాళెం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం విదితమే. ఈ విషయంపై మరికొంత మంది రైతులతో కలిసి కౌంటర్ ఇప్పించడానికి అబ్దుల్ అలీ గురువారం ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది. మీడియా, ఇతర మండలాలకు చెందిన రైతుల సమక్షంలోనే బాధిత తిరుగుబాటు చేసి, తమ భూములు ఆక్రమించుకున్నారంటూ వాగ్వాదానికి దిగారు. జీవనాధారంగా ఉన్న మామిడి చెట్లు, భూముల ఆక్రమణతో వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అబ్దుల్ అలీపై రైతుల వ్యతిరేక వాదనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయన అనుచరులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ భూములు తిరిగి అప్పజెప్పాల్సిందేనంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలీ పెకలించి వేయించిన మామిడి మొక్కలు దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు.. అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా మా భూములు లాక్కున్నారు. ఎర్రావారిపాళెం మబ్బుతోపు సమీపంలో పందిమల్లచెరువు కింద ఉన్న పొలాలన్నీ బలవంతంగా లాక్కున్నవే. అక్కడ భూముల్లో సర్వే నెం.1923/1, 1923–1ఎలో రెండున్నర ఎకరాలు మాకు ఉండేది. భూమిలో సుమారు 200పైగా మామిడి చెట్లు ఉండేవి. 20 ఏళ్ల నుంచి కాయకష్టం చేసి మామిడి చెట్లు పెంచుకున్నాం. ఏడాదికి మామిడి కాపు ద్వారా లక్షన్నరపైగా ఆదాయం వచ్చేది. అటువంటి భూములను బెదిరించి లాక్కున్నారు. అధికారులు కూడా వత్తాసు పలకడంతో చేసేది లేక ఒప్పుకున్నాం. – చిన్నరెడ్డెమ్మ, ఎర్రావారిపాళెం, మహిళా రైతు అధికారులూ వత్తాసుపలకడం బాధాకరం.. అబ్దుల్ అలీ ఆక్రమిత భూముల్లో సర్వే నెం.1190లోని భూమి 40 ఏళ్లుగా మా అనుభవంలో ఉండేది. నిరుపేదలైన మేము పలుమార్లు పట్టా ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ప్రాధేయపడ్డాం. అక్కడ మాకు పట్టాచేయడానికి వీలు లేదని మా అభ్యర్థనను తిరస్కరించారు. సదరు సర్వే నంబరు భూమిని అబ్దుల్ అలీకి కట్టబెట్టారు. పేదవాడు పొట్టగడుపుకోవడం కోసం అభ్యర్థిస్తే ఇవ్వని పట్టా.. ఎన్ఆర్ఐకి అధికారులు కట్టబెట్టడం దారుణం. – మల్లూరి మధు, ఎర్రావారిపాళెం -
కబ్జాదారుల భరతం పట్టండి
ఏలూరు(పశ్చిమగోదావరి) : పేదల ఇళ్ల స్థలాలు కాజేసి అమ్ముకున్న కబ్జాదారుల భరతం పట్టాలని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కబ్జా వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తామన్నారు. బుధవారం ఆయన ఏలూరు మండలం వెంకటాపురం, కొమడవోలు, మాదేపల్లిరోడ్డులో ఇందిరమ్మ ఇళ్ల కాలనీలను ఆకస్మిక తనిఖీ చేశారు. కాలనీల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు, ఖాళీ స్థలాలు, కామన్ సైట్లను పరిశీలించారు. కాలనీ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే హౌసింగ్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌తో పాటు స్థానిక తహసీల్దార్‌తో కాలనీల స్థితిగతులు, ప్రజల సమస్యల గూర్చి చర్చించారు. కబ్జాదారులపై చర్యలు.. కొందరు టీడీపీ నాయకులు ఖాళీస్థలాలు అమ్ముకున్నారని కాలనీవాసులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేసిన స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్న వారిని గుర్తించాలన్నారు. అవసరమైతే వీరిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. స్థలాలు కొనుక్కుని ఇళ్లు నిర్మించుకున్న వారు అర్హులైతే న్యాయం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కాగా కొత్తూరు కాలనీలో ఉన్న 900 ఇళ్ల స్థలాల్లో 640 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి చెప్పారు. కామన్ సైట్ల చుట్టూ కంచె వేయండి.. కాలనీల్లో కామన్‌సైట్లను గుర్తించి పంచాయతీ కార్యదర్శికి అప్పగించాలని తహసీల్దార్ సూర్యనారాయణను ఆదేశించారు. కామన్సైట్లు ఆక్రమణకు గురికాకుండా తక్షణం కంచె నిర్మాణం చేపట్టాలని కార్యదర్శి సాయికృష్ణకు చెప్పారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు మహిళలు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును పిలిచి రోజూ రాత్రి వేళల్లో కాలనీల్లో గస్తీ తిరగాలని సూచించారు. పోలీసులు చర్యలు చేపట్టకపోతే నాకు ఫోన్ చేయండి అంటూ మహిళలకు తెలిపారు. బాధితుడికి చేయూత : అనారోగ్యంతో మంచాన పడిన కాలనీవాసుడు దత్తి రవికుమార్ అనే వ్యక్తిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి పర్యటనలో పలుశాఖల అధికారులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులు ఉన్నారు. -
టీడీపీ నేతల గుండెల్లో భూకంపం
ఆక్రమించిన ప్రభుత్వ భూములను ఎలాగో అమ్మేశాం, ఇక మనల్ని అడిగేదెవరూ.. అని కొందరు టీడీపీ నేతలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. ఆ భూములను అమ్మిపెట్టిన దళారులైతే మన కమీషన్ మనకొచ్చేసింది.. మనల్ని అడిగేదెవరు అనుకున్నారు. అయితే ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపుపై కలెక్టర్ రేవు ముత్యాలరాజు పట్టుదలగా ఉండడంతో పచ్చ నేతల్లో గుబులు నెలకొంది. సాక్షి, ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి) : భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అనేక సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయి. టీడీపీ ప్రజాప్రతినిధులే రాబందుల్లా వాటిని కాజేశారు. వాటిలో ఒకటి ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీ. ఇక్కడ గత టీడీపీ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భూవిక్రయాల బాగోతం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. గుండెల్లో ‘భూ’కంపం రేగినట్టు బాధను మింగలేక, బయటకు కక్కలేక సతమతమవుతున్నారు. జిల్లా యంత్రాంగం తాడేపల్లిగూడెంలోని దేవదాయ శాఖ భూముల్లో ఆక్రమణల తొలగింపు చేపడుతున్న నేపథ్యంలో ద్వారకాతిరుమల టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. అసలేం జరిగిందంటే.. ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీ వద్ద ఆర్ఎస్ నంబర్ 11, 1/2లోని ఎంతో విలువైన ప్రభుత్వ కొండ పోరంబోకు భూమిని టీడీపీ నేతలు కొందరు దళారుల చేత విక్రయించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు సంబంధించిందంటూ అప్పట్లో దాదాపు 26 సెంట్లు భూమిని కొందరు ధనికులకు, లక్షలాది రూపాయలకు అమ్మేశారు. ఈ భూబాగోతాలపై ‘సాక్షి’ గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో భూమిని విక్రయించిన టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇక కొనుగోలు చేసిన వారికైతే ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలోనే ‘సాక్షి’ కథనాలపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావును విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన గతేడాది సెప్టెంబరు 20న స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను, వివాదాస్పద భూమిని పరిశీలించి అవకతవకలను గుర్తించారు. అలాగే భూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అప్పట్లో పార్టీ నేతలతో కలిసి, వివాదాస్పద ప్రభుత్వ భూమిని పేదలకు అందేలా చూడాలని ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. దీంతో విక్రయానికి గురైన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ చక్రధరరావు తహసీల్దార్‌ను ఆదేశించారు. కానీ ఆదేశాలు భేఖాతరవడంతో కొనుగోలుదారులు ప్రభుత్వ భూమిలో బేస్ మెంట్లు వేసి, దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. ఈ భూబాగోతాలపై స్థానికులు కొందరు గత జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు దృష్టిపెట్టేనా! విక్రయాలకు గురైన ప్రభుత్వ భూమి పేదలకు చెందాలని పోరాడిన వైఎస్సార్ సీపీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో పాటు, జిల్లా అధికారులు భూ ఆక్రమణలపై దూకుడు పెంచడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తొమ్మిది నెలలుగా విచారణ పేరుతో మూలనపడి ఉన్న ఫైల్ బయటకు వస్తుందేమోనని బిక్కుబిక్కు మంటున్నారు. ఒకవేళ ఆక్రమణలను తొలగించే పరిస్థితే గనుక ఎదురైతే తమ పరిస్థితి ఏమిటా అని వారు తర్జనభర్జన పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి, వాటిని నిరుపేదలకు అందించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
టీడీపీ నేతల భూదాహం.. రైతులకు శాపం
సాక్షి, నగరం(గుంటూరు) : గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకుల భూదాహం రైతుల పాలిట శాపంగా మారింది. మండలంలోని టీడీపీ నేతల అక్రమాలకు రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్ట (ఆర్ఎం డ్రైయిన్), న్యూకోర్స్ కాల్వ కట్టలు బక్కచిక్కిపోయాయి.వీటిని అభివృద్ధి పరిచిన సంవత్సరానికే కోతకు గురయ్యాంటే కాల్వ కట్టలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాల్వ కట్టల మట్టిని మట్టానికి కల్లా టీడీపీ నాయకులు దోచుకోవడంతో చిన్న పాటి వర్షాలకే అవి భారీగా కోసుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నగరం నుంచి అద్దంకివారిపాలెం వెళ్లే దారిలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో 10 నుంచి 15 చోట్ల కాల్వకట్ట భారీగా కోసుకుపోయింది. ఈ విషయంపై అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓగ్ని తుఫాన్ సమయంలో రైతులకు అపారనష్టం: 2006 సంవత్సరంలో ఓగ్ని తుఫాన్ సమయంలో నగరంలో కాల్వ కట్టకు భారీగా గండి పడింది. వేలాది ఎకరాల్లోని పంట ముంపుకు గురై, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ సమయంలో గండి పూడ్చేందుకు లక్షలాది రూపాయల్ని వెచ్చించినా అప్పటికే రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావు కాల్వ కట్టల అభివృద్ధికి నిధుల కేటాయించాలని కోరగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాల్వకట్టల అభివృద్ధికి సుమారుగా రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో విడతల వారీగా కాల్వ కట్టలను అభివృద్ధి పరిచారు. తర్వాత 2012లో రూ.9.5 కోట్లతో అద్దంకివారిపాలెం నుంచి ఈదుపల్లి వరకు సుమారు 6 కి.మీ మేర కాల్వ కట్టల అభివృద్ధి పనులు ప్రారంభించారు. రెండేళ్ల పాటు కాల్వ కట్టల అభివృద్ధి పనులు నిర్వహించారు. ఈ సమయంలో వచ్చిన మట్టిని కాల్వ కట్టలపై గుట్టలుగా పోశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతల కన్ను మట్టి గుట్టలపై పడింది. దీంతో నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలుగా మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. కనీసం కట్ట ఎత్తు 10 అడుగులపై ఉంచాల్సిన మట్టిని మట్టానికి కల్లా తీసేయడంతో కాల్వ కట్టలు బక్కచిక్కిపోయాయి. ఈ సమయంలో రైతులు అభ్యంతరాలు చెప్పినా అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా కోట్లాది రూపాయల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. దీంతో కాల్వ కట్టల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాల్వ కట్టల మరమ్మత్తుల పేరుతో నిధుల దోపిడీ.. కాల్వ కట్టల మరమ్మత్తు నిధులను టీడీపీ నేతలు దోపిడీ చేశారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. 2016 సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు కారంకివారిపాలెం సమీపంలో మురుగుతూముల వద్ద కాల్వ కట్టకు గండి పడింది. ఆ సమయంలో నీటి ఉదృతి అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకోలేదు. ఈ సమయంలో కట్టల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారుగా 10 లక్షల నిధులు కేటాయించారు. ఈ నిధులను టీడీపీ నేతలు దోపిడీ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. మరమ్మత్తు పనులను తూతూ మంత్రంగా నిర్వహించి, నిధులను స్వాహా చేశారని పలువురు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. మురుగుతూముల వద్ద కల్వర్టులు నిర్మించకుండా కట్టలు మాత్రం పూడ్చారు. అప్పుడు పనుల్లో నాణ్యత కొరవడుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ కట్టలకు గండ్లు పడకముందే వాటిని పటిష్టం చేయాలని రైతులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే గండి పడుతోంది.. రేపల్లె ప్రధాన మురుగు కాల్వ కట్టలు బలహీనంగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షాలకే వాటికి గండి పడుతున్నాయి. కాల్వకు గండి పడటం వల్ల పంట పొలాలు ముంపుకు గురై అపార నష్టం వాటిల్లుతుంది. రైతుల బాధల్ని అర్థం చేసుకుని కాల్వ కట్టలను అభివృద్ధి పరచాలి – కారంకి రాం బాబు, రైతు కాల్వ కట్టల ఎత్తు పెంచాలి కాల్వ కట్టల మట్టిని తరలించడం వల్ల కట్టలు బలహీనమయ్యాయి. కాల్వ కట్టలు రహదారి ఎత్తులో ఉండటం వల్ల వర్షపు నీటికి కట్టలు కోసుకుపోతున్నాయి. కట్టల ఎత్తు పెంచితే కోతకు గురికాకుండా ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ కట్టలను పటిష్ట పరచాలి. లేకపోతే పంటలు ముంపుకు గురికాక తప్పదు. – ఎం నాగరాజు, రైతు -
టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు..
రాజధాని అమరావతి ఏర్పాటు.. అంతా గ్రాఫిక్స్ మాయాజాలం.. భూములు తీసుకునేటప్పుడు రైతులకు అరచేతిలో సింగపూర్ చూపించారు. తీరా భూములు లాక్కున్నాక సవాలక్ష చిక్కుముడులు వేసి చుక్కలు లెక్క పెట్టించారు. రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో భూములు కొనేసి భారీగా లబ్ధి పొందారు. భూములు అమ్ముకున్న రైతులు లబోదిబోమన్నారు. పంట భూములకు కౌలు నిర్ధారణలో నిజమైన రైతులను నిలువునా ముంచారు. టీడీపీ నేతల మెట్ట భూములను సైతం జరీబుగా నిర్ధారించేశారు. అసైన్డ్, లంక భూముల పేరుతో దళితులకు రిక్తహస్తం చూపారు. ఆ భూములు లాక్కున్నాక కౌలు లెక్కలు కట్టించారు. ఇలా అడుగడుగునా అవకతవకలతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. కొందరు అధికారులు అధికారానికి కొమ్ముకాసి రైతులకు అన్యాయం చేశారు. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులంతా గుండెలు గుప్పిట్లో పెట్టుకుని వణికిపోతున్నారు. తమ దురాగతాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తుతున్నారు. సాక్షి, అమరావతి : టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్. రాజధాని అమరావతి పేరుతో ఐదేళ్లపాటు టీడీపీ నాయకులు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి రానున్నాయి. లేనిభూములు ఉన్నట్లు సృష్టించి ప్లాట్లు పొందిన వైనం, భూమి ఉన్నా కూలీలకు ఇచ్చే పింఛన్ కాజేసిన వారి వివరాలు, సాధారణ రైతుల భూమిలో నుంచి కొంత భాగం ఆక్రమించి వాటిని తమ పేరు మీద దొంగ పత్రాలు సృష్టించి పరిహారం.. ఇలా ఒక్కటేమిటి ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో టీడీపీ నాయకులు పాల్పడిన కుంభకోణాలు, దురాగతాలు, అరాచకాలు, ఆక్రమణలను తవ్వే పనిలో అధికారం పక్షం సిద్ధమైంది. ప్రకటనకు ముందే భూముల కొనుగోలు..! రాజధాని ప్రకటనకు ముందే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ పరిధిలో టీడీపీ నాయకులు వారి అనుయాయులు పెద్ద సంఖ్యలో భూములు కొనుగోలు చేశారు. రైతుల నుంచి కారు చౌకగా వేల ఎకరాలను కొనుగోలు చేసిన తర్వాత తీరిగ్గా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. దీంతో భూములు విక్రయించిన రైతులు లబోదిబోమన్నారు. అలాగే దళితులు సాగు చేసుకుంటున్న లంక, అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వదని నమ్మించి... ఆ భూములను టీడీపీ నాయకులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. ఇలా దళితులను దగా చేసిన వారి వెన్నులో ప్రస్తుతం వణుకు పుడుతోంది. భారీగా ఇన్సైడ్ ట్రేడింగ్...! రాజధాని భూముల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ తీగను లాగేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం పాల్పడిన కుంభకోణాలపై అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే రైతులతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై వారి బాధలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. ఒక్కో భూమికి ఒక్కో ప్యాకేజీ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. సీఆర్డీఏ గ్రామ కమిటీలుగా టీడీపీ నాయకులు సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఒక్కో భూమికి ఒక్కో ప్యాకేజీ నిర్ణయించారు. కొంత మంది టీడీపీ నాయకులు తమది మెట్ట భూమి అని తెలిసినా రికార్డుల్లో జరీబుగా నిర్ధారించి ప్యాకేజీ కొట్టేశారు. మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో దాదాపు 90 మంది టీడీపీ సానుభూతి పరులు కలిసి కూలీలకు ఇచ్చే పింఛన్‌ను 18 నెలలపాటు అక్రమంగా బొక్కేశారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో రైతుల భూముల్లో కొద్ది భాగాన్ని ఆక్రమించి... ఆ భూమిపై నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా ప్లాట్లు కొట్టేయడంతోపాటు కౌలు చెక్కులు తీసుకున్నారు. ఇలా ఐదేళ్లపాటు సాగించిన అక్రమాలన్నీ ఇప్పుడు బట్టబయలు కానున్నాయి. దళితులను తీవ్రంగా మోసగించారు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో సుమారు 2,200 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. వీటిలో అధిక శాతం కృష్ణా తీరం వెంబడి ఉన్న లంకల్లోని దళిత రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ఇవ్వబోమని చెప్పడంతో మొదట్లో దళిత రైతులంతా కారుచౌకగా విక్రయించేసుకున్నారు. దళిత రైతుల మధ్య చిచ్చు పెట్టి వారిని విభజించి పాలించాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా పావులు కదిపింది. ఇందులో భాగంగానే అసైన్డ్ భూములను దళిత రైతులు విక్రయించిన తర్వాత ప్యాకేజీ ప్రకటించి తీవ్రంగా మోసగించారు. మోసపోయిన దళిత రైతులంతా ఇప్పుడు ఎదురు తిరుగేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం పరిణామాలపై సమీక్ష రాజధాని ప్రకటన... అంతకు ముందు టీడీపీ నాయకులు పాల్పడిన ఇన్సైడ్ ట్రేడింగ్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మొత్తం కుంభకోణాలపై విచారణకు ఆదేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పట్లో టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తిన అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. అక్రమాలకు సహకరించి అడ్డంగా బుక్కయ్యామనే భయం వారిని వెంటాడుతోంది. దీనికి తోడు ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితా తన వద్ద ఉందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచనిస్థితిలో అధికారులు పడ్డారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులకు పనిచేసిన నాయకులు, స్థానికంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారి అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
పరిహారం కోసం.
ఇల్లెందుఅర్బన్(భద్రాద్రి కొత్తగూడెం): ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీ విస్తరణలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూమి కోల్పోయామని, పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఓ రైతు ఆదివారం పట్టణంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి 47 లెవల్ఫిల్టర్ బెడ్ సమీపంలో వ్యవసాయ భూమి కలిగిన రైతు సుందర్‌లాల్‌పాసి ఎడ్లబండిపై ప్రయాణిస్తూ సింగరేణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన సెంటర్ల్లో తమకు జరిగిన ఆవేదనను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను సాగు చేసుకుంటున్న భూమికి రెవెన్యూ అధికారులు పట్టా అందజేసినప్పటికీ సింగరేణి అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తమకు పరిహారం చెల్లించకపోతే కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామనిహెచ్చరించారు. -
పట్టా అడిగితే ఫారెస్ట్ అధికారుల దాడులు..
సాక్షి, కొల్లాపూర్‌రూరల్: మండలంలోని నార్లాపూర్ సమీపంలో, మల్లబస్వాపురం శివారులో కుడికిళ్ల గ్రామానికి చెందిన దళిత రైతులు 120 ఎకరాల పోడు భూమిని 1961 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నారు. నేటికీ ఆ భూములకు చట్టబద్దత లేదు. గతంలోని పాలకులందరికీ దళిత రైతులు విన్నపాలు చేశారు. కానీ నేటి వరకు ఎలాంటి పట్టాలకు నోచుకోలేదు. సర్వేనంబర్ 36/1, 36/2లో 120 ఎకరాల ఫారెస్ట్ పోడు భూములను 60 కుటుంబాలకు చెందిన కుడికిళ్ల దళిత రైతులు తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారు. బెదిరింపులకు గురిచేస్తున్నారు.. సాగుచేసుకుంటున్న భూములను తమ పేరుపై పట్టా చేయాలని కోరుతున్నా రైతులను ఫారెస్ట్ అధికారులు దాడి చేస్తున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో భూమిలేని నిరుపేద రైతులు శిస్తు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చేముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫారెస్ట్ భూములకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు కావస్తున్నా నేటివరకు ఎలాంటి స్పందన లేదు. ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్ భూములు సాగు చేసుకుని అనుభవిస్తున్న కుడికిళ్ల దళిత రైతులకు పట్టాలివ్వాలని కోరుతున్నారు. ప్రతిఏటా ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. పాలకులు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు తక్షణం స్పందించి శిస్తు చేసుకుని అనుభవిస్తున్న పోడు భూములపై సర్వే నిర్వహించి పట్టాలకు ప్రపో జల్స్ పంపాలని రైతులు కోరుతున్నారు. హక్కు కల్పించాలి మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామ సమీపంలో మల్లబస్వాపూర్ శివారులో శిస్తు చేసుకుని అనుభవిస్తున్న ఫారెస్ట్ భూములకు పట్టాలివ్వాలి. రెండు, మూడు తరాల నుంచి పోడు భూములను శిస్తు చేసుకుని అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇవ్వాలి. – శ్రీనివాసులు, కుడికిళ్ల కేసు పెట్టినా వెనక్కి తగ్గం మల్లబస్వాపూర్ శివారులో 36 సర్వేనంబర్‌లో 120 ఎకరాల భూములను 60 కుటుంబాలకు చెందిన మా తాతలు, తండ్రులు శిస్తు చేసుకుని అనుభవిస్తున్నారు. ఆ సమయంలో ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టారు. అయినా కూడా నేటి వరకు శిస్తు చేసుకుని అనుభవిస్తున్నాం. ముఖ్యమంత్రి హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలిస్తారనే ఆశ ఉంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి పట్టాలివ్వాలి. – బిచ్చయ్య, కుడికిళ్ల -
భూ మాంత్రికుడు!
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ పాలనలో భూ బకాసురులు పెరిగిపోయారు. కడప నగరంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ భూములు, పట్టా స్థలాలు అనే తేడా లేకుండా ఆక్రమిస్తున్నారు. అధికారులతో లాలూచీ పడి ఆయా వ్యక్తుల పేరిట భూములు, స్థలాలను ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నారు. అసైన్డ్, దేవాదాయ, వంక, కొండ, పొరంబోకు, నీటమునక, రిజర్వుడు స్థలాలపై కన్నేశారు. సర్వే నంబర్లు మెలికలతో నకిలీ పత్రాలు సృష్టించి స్వాహా చేస్తున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ భూములను స్వాహా చేసేందుకు ఓ టీమ్ వెలిసింది. స్థానిక టీడీపీ నాయకుడి నేతృత్వంలోని ఆ టీమ్ విలువైన భూములను స్వాహా చేయడం వాటికి డాక్యుమెంట్లు పుట్టిస్తోంది. ఒరిజనల్ పట్టాకు చెందిన సర్వేనంబర్‌తో కబ్జా చేసిన స్థలం హద్దులు వేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. స్థలం హద్దులు సరిగ్గా ఉంటాయి. ఆ హద్దుల పరిధిలో ఉన్న స్థలం ప్రభుత్వ బంజరు లేదా పీఓబీ (ప్రొబుటరీ ఆర్డర్ బుక్) ల్యాండ్ ఉంటోంది. స్థానికులెవ్వరైనా అడిగితే తమకు రిజిస్ట్రేషన్ ద్వారా సంక్రమించిన భూమిగా ఫోజులు కొడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. సర్వే నంబర్ 335లో 4.28 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గతంలో కొందరికీ పట్టాలు అందించారు. దాదాపు 3 ఎకరాల భూమిని రిజర్వు చేసి పెట్టారు. అందులో పార్కు నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు. ఆ స్థలం కబ్జాకు గురైంది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ప్రభుత్వ భూమి హద్దులతో నకిలీ సర్వే నంబర్‌తో డాక్యుమెంటు పుట్టించాడు. సర్వే నంబర్ 340లో 6.28 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో బీడీ కార్మికులకు డీకేటీ పట్టాలు అప్పగించి కాలనీ ఏర్పాటు చేశారు. మరో ఎకరా రిజర్వు చేసి పెట్టారు. ఆ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఆ స్థలాన్ని తీసి పెట్టారు. మాజీ కార్పొరేటర్ ఒకరు ఆ స్థలాన్ని ఆక్రమించారు. బీడీ కాలనీలో రిజర్వు చేసిన స్థలం తనదే అని బాహాటంగా వెల్లడిస్తున్నాడు. అలాగే సర్వే నంబర్ 341లో 3.32 ఎకరాలు, సర్వే నంబర్ 342లో 3.24 ఎకరాలు ఉన్న భూమి పీఓబీ ల్యాండ్. దీనిని ఎవ్వరికీ పట్టాలు ఇచ్చేందుకు కూడా రెవెన్యూ నిబంధనలు అంగీకరించవు. అలాంటి భూమిని సైతం మాజీ కార్పొరేటర్ గుప్పిట్లో పెట్టుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 340, 341, 342 సర్వే నంబర్లు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ఈ సర్వే నంబర్లలో ఉన్న భూమికి అమాంతం రేట్లు పెరిగాయి. ఆ భూమి ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో సదరు మాజీ కార్పొరేటర్ రాజకీయ విన్యాసాలు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నకిలీ పట్టాలు, డాక్యుమెంట్లు పుట్టిస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కబ్జా చేసిన స్థలాల్లో ప్రహరీ ఏర్పాటు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుండిపోవడం మినహా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అండగా నిలుస్తున్న రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఆన్లైన్లో అక్రమార్కుల పేర్లును చేరుస్తూ రెవెన్యూ అధికారులు వారి సేవలో తరిస్తున్నారు. కడప కలెక్టరేట్‌కు పక్కనే ఉన్న సర్వేనంబర్ 955లో 23 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఆర్ట్స్ కళాశాలకు కేటాయించగా 0.03 సెంట్ల స్థలం మిగిలింది. అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌కు ఎదురుగా ఉన్న ఈ స్థలం రెవెన్యూ రికార్డుల్లో నీటిమునకగా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.45లక్షలుగా ఉంది. ఆ భూమికి సంబంధించి ఆన్లైన్లో రెవెన్యూ అధికారులు అక్రమార్కుల పేరు చేర్చారు. అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఏఆర్ఐ రవిని సస్పెండ్ చేశారు. కడప నగర శివార్లలోని స్థలాలను ధ్రువీకరించడంలో రెవెన్యూ యంత్రాంగం కీలకంగా మారింది. ఆర్కేనగర్, బీడీ కాలనీ, చలమారెడ్డిపల్లె, ఇందిరానగర్లలో కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పునాదులు వెలుస్తున్నాయి. సర్వే చేసేందుకు ఆసక్తి చూపని వైనం.. కడప శివార్లలోని బీడీ కాలనీ, ఆర్కేనగర్ పరిధిలో సర్వే నంబర్లు 335, 340లో సర్వే చేపట్టి ప్రభుత్వ స్థలం గుర్తించాలని అందులో పార్కు నిర్మాణం చేపట్టనున్నట్లు కార్పొరేషన్ విభాగం అధికారికంగా కోరింది. అటు వైపు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసేందుకు కుంటి సాకులు చూపుతూ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొరంబోకు, పీఓబీ భూమిని సైతం స్వాహా చేసి హద్దులు ఏర్పాటు చేసుకుంటుంటే నిలువరించే ప్రయత్నం చేయడం లేదని పలువురు వివరిస్తున్నారు. ఈ విషయమై కడప తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా కార్పొరేషన్ యంత్రాంగం వస్తే సర్వే చేసి పార్కు స్థలాన్ని గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిసే చర్యలు తప్పవన్నారు. -
రూ.5కోట్ల భూమి ఆక్రమణకు యత్నం
పోరుమామిళ్ల : రాత్రికి రాత్రి ప్రభుత్వభూమి ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.రెవెన్యూ అధికారుల ఉదాసీన, నిర్లక్ష వైఖరి వల్ల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వభూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రెండు దశాబ్దాల కాలంగా నిరాటంకంగా జరుగుతున్న కబ్జాలను అరికట్టే చర్యలు జరగలేదు. అధికారులు రెవెన్యూచట్టాలను ఉపయోగించి, కఠినచర్యలు తీసుకోకపోవడం అక్రమణదారులకు వరంగా మారింది. కబ్జాదారులు బోగస్‌పత్రాలు సృష్టించి, కార్యాలయ సిబ్బంది సహకారంతో రికార్డుల్లో నమోదు చేయించడం, అడ్డుకుంటే కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది. మండల కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వభూములపై చాలాకాలంగా కబ్జాదారులు కన్ను వేశారు. వాటిని స్వాధీనం చేసుకుంటే కోట్ల రూపాయలు సునాయాసంగా జేబులో పడతాయన్న దురాశతో అధికారులను, నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఈ విషయంలో సఫలీకృతులయ్యారు.ఈ నేపథ్యంలో సర్వేనెంబరు 1008, 1009లో ఆదివారం రాత్రి డోజర్‌తో చదును చేసి, అందులో నిర్మాణాలు చేపడితే కోట్లరూపాయల భూమి సొంతమవుతుందని కొందరు భావించారు. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతుండగా గమనించినవారు తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన వీఆర్వోను అలర్ట్ చేయడంతో వారు ప్రయత్నాలు ఆపి పరారైనట్లు తెలిసింది. ఈ స్థలం ఏడెమిదేళ్లుగా వివాదంగా ఉంది. ఆ సర్వేనెంబరులో రంగసముద్రం సచివాలయం నిర్మించారు. ప్రభుత్వస్థలంలో భవనం నిర్మిస్తే, కొంతమంది ఆస్థలం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా బోగస్ పత్రాలు సృష్టించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బోగస్ పత్రాల సహకారంతో కోర్టుకు పోవడం, సచివాలయం నిరుపయోగంగా మారడం జరిగింది. ఏడేళ్లుగా ఈ స్థలాన్ని ప్రభుత్వభూమిగా స్పష్టం చేయడం అధికారులకు సాధ్యం కాలేదంటే రెవెన్యూశాఖ పనితీరు గురించి అర్థం చేసుకోవచ్చు. పోరుమామిళ్ల–మైదుకూరు ప్రధాన రహదారిలో ఉన్నందున ఆ భూమి విలువ రూ. 5 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. కబ్జాకు ప్రయత్నం చేసినవారిపై కేసు పెడతామని అధికారులు తెలిపారు. సోమవారం బంద్ దృష్ట్యా సిబ్బంది రాలేదని, మంగళవారం పూర్తి వివరాలతో కేసు పెడతామన్నారు. ఆక్రమణకు ప్రయత్నించిన వారి వివరాల గురించి ప్రశ్నించగా విచారిస్తున్నామని, రేపు చెబుతామన్నారు. చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్ చంద్రశేఖరవర్మ సర్వేనెంబరు 1008, 1009లో జరిగిన ఆక్రమణ గురించి తహసీల్దారు చంద్రశేఖరవర్మ, వీఆర్ఓ సదానందంలను వివరణ కోరగా దుండగుల గురించి విచారిస్తున్నామన్నారు. భూమి చదును చేసేందుకు ఉపయోగించిన యంత్రం (డోజర్/ జేసీబీ) స్వాధీనం చేసుకుంటామన్నారు. దాదాపు ఎకరన్నర భూమి చదును చేశారన్నారు. ఆ భూమిపై కోర్టులో ‘డబ్ల్యూఎపి 4755/2011, 4788/2011’ నంబర్లతో కేసు నడుస్తోందన్నారు. -
‘శ్మశానం’లో రాజకీయం!
వేములవాడరూరల్: మండలంలోని రుద్రవరం గ్రామ పునరావాస కాలనీలో శ్మశాన వాటికకు 2016లో అప్పటి అధికారులు సర్వే నంబర్ 65, 66, 67 లోని ఆరు ఎకరాల స్థలాన్ని పంచాయతీ అధికారులకు అందజేశారు. మూడేళ్లుగా స్థల యజమాని అప్పగించడంలేదు. తన స్థలం అనుపురం పరిధిలో ఉందని, రుద్రవరం పరిధిలో ఉన్న స్థలాన్నే తీసుకోవాలంటూ యజమాని శ్మశాన వాటికకు కేటాయించిన స్థలానికి అడ్డుపడుతున్నాడు. ఈ ఆందోళన ఎట్టకేలకు కలెక్టర్ వరకు చేరింది. ఈ విషయంపై రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో తమ గ్రామానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలం తమకే దక్కాలని దానికి హద్దులు ఏర్పాటు చేసి తమకు ఇవ్వాల సర్పంచ్‌తోపాటు గ్రామ పెద్దలు కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ గతంలో ఇచ్చిన విధంగా ఆరెకరాలు ఇవ్వడం కుదరదని, నాలుగు ఎకరాలు రెండు గ్రామాల్లో కలిపి తీసుకోవాలంటూ కలెక్టర్ వారికి తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేక గతంలో తమకు కేటాయించిన స్థలం నుండే తగ్గిస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కలెక్టర్ స్థలాన్ని తగ్గించడంతో తాము న్యాయ పోరాటం చేస్తామని సర్పంచ్ పిల్లి రేణుక తెలిపారు. గతంలో అధికారులే తమకు అన్ని ఆధారాలతో అనుమతులతో స్థలాన్ని అప్పగించారని ప్రస్తుతం ఆ స్థలం నుంచి కొంత స్థలాన్ని తీసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
నీకు సగం.. నాకు సగం..
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో గతంలో గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా ఆర్డీవో రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించి, బల్దియాపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. బల్దియాలో జీతభత్యాలు, జమా ఖర్చులు, ఆదాయ వనరులు, అక్రమ లే అవుట్లు, మున్సిపల్ స్థలాలపై ఆయన విచారిస్తున్నారు. అయితే వీటిలో కీలకమైన లేఅవుట్లు, 10శాతం భూముల కేటాయింపులపై ఆర్డీవో చేతికి ఫైళ్లు అందకుండా కొందరు అక్రమార్కులు ఫైళ్లనే మాయం చేశారు. 1990 నుంచి 2015 వరకు గల ఫైళ్లను మొత్తం బల్దియాలోనే లేకుండా చేశారు. కొందరు వార్డు సభ్యులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా పాత ఫైళ్లనే గల్లంతు చేయడం చర్చనీయాంశమవుతోంది. బల్దియా పరిధిలో చేసే లే అవుట్ల సందర్భంగా పార్కులు, ఇతర ప్రజా కార్యకలాపాల కోసం కేటాయించే భూమిని కొందరు వార్డు సభ్యులు, అధికారుల సహకారంతో విక్రయించిన సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. 1995 నుంచి 2018 వరకు లే అవుట్లకు సంబంధించిన భూములు జీపీ పరిధిలో ఉండాలి. అయితే వార్డు సభ్యులు ‘నీకు సగం.. నాకు సగం’ అనే రీతిలో అధికారులతో మిలాఖాత్ అయి ఆ భూములను అమ్ముకున్నారు. చేతులు మారిన భూములు.. వాస్తవానికి బాన్సువాడ బల్దియా పరిధిలో అధికారికంగా 28,509 గజాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. 1983 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ(ప్రస్తుత బల్దియా) పరిధిలో 63 లే అవుట్లు చేశారు. వీటిలో 10 శాతం చొప్పున భూములను కేటాయించారు. అయితే ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పేరిట భూములను ధారాదత్తం చేశారు. వాటిని ప్లాట్లుగా మార్చి ఇద్దరు, ముగ్గురు చేతులు మార్చి మరీ అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం భూముల్లో భవనాలు వెలిసాయి. జీపీ లెక్కల ప్రకారం 4,298 గజాల భూమిని సంఘాలకు కేటాయించారు. అయితే అనధికారికంగా మరో 10వేల గజాల భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు 10శాతం భూములను కాజేసేందుకు పాలకవర్గంతో తీర్మానాలు కూడా చేయించారు. ప్రస్తుతానికి 14,211 గజాల భూమి మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది. లేఅవుట్ ఫైళ్లు గల్లంతవడంతో ఆ భూములను గుర్తించడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఇన్చార్జి కమిషనర్ రాజేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని రికార్డులను పక్షం రోజుల క్రితమే స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లేఅవుట్ ఫైళ్లు లేకపోవడం గమనార్హం. ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం.. బల్దియాకు కీలకం లే అవుట్ ఫైళ్లు. వాటి ఆధారంగానే రోడ్లు, ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, జీపీకి కేటాయించిన భూములను గుర్తిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఫైళ్ల మాయంతోపాటు వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫైళ్లను గల్లంతు చేస్తే తాము చేసిన అక్రమాలను కప్పి పుచ్చవచ్చని, అమ్మిన భూములను స్వాధీనం చేసుకొనే వీలుండదని పక్కా ప్రణాళిక ప్రకారం వీటిని మున్సిపాలిటి కాకముందే మాయం చేశారు. అనుమతులన్నీ పెండింగ్‌లోనే.. గత నెల 20న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మూడు నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీగా మారనుందనే ప్రచారం జరగడంతో అనేక మంది భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకొని వార్డు సభ్యుల ద్వారా అనుమతులు పొందారు. అయినా మరో వంద దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఇవ్వాలి. లేఅవుట్ల ఫైళ్లు కూడా ఆర్డీవో పెండింగ్‌లో పెట్టారు. మున్సిపాలిటీలో ఆదాయ వనరుల వివరాలు స్పష్టంగా లేవు. అక్రమాలపై వెంటనే విచారిస్తాం.. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాం. లే అవుట్ ఫైళ్ల గల్లంతవగా, దీనిపై ఆరా తీçస్తున్నాం. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. సిబ్బంది రాగానే బల్దియా పాలనను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. జీపీకి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఇకపై ఏ అనుమతి లేనిదే పనులు చేయరాదు. –రాజేశ్వర్, ఇన్చార్జి కమిషనర్ -
మీ ఊరును కొనేశా.. ఇళ్లు వదిలి వెళ్లిపోండి
సాక్షి, తిరుపతి: ఎదురుగా ఏడుకొండలవాడు... పక్కనే పద్మావతి అమ్మవారి ఆలయం. చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలో సెంటు భూమి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. అక్కడ నివాస స్థలాలను కొనుగోలు చేసుకునేందుకు పోటీలు పడుతుంటారు. జిల్లాకు చెందిన వారే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా అక్కడ భూములు కొనుగోలు చేశారు. కొందరు భవనాలు కూడా నిర్మించుకుంటున్నారు. ఇప్పుడా ఊరి ప్రజలకు ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. వందేళ్ల క్రితం ఏర్పడిన ఆ గ్రామాన్ని స్థానికులు ఆక్రమించుకున్నారంటూ స్థానిక టీడీపీ నేత కృష్ణమూర్తినాయుడు నోటీసులు పంపించారు. తరచూ తమపై పోలీసులను ప్రయోగించి బెదిరిస్తున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. వందేళ్ల నాటి గ్రామం.. తిరుపతి నగరానికి కూతవేటు దూరంలో ఉన్న దామినేడు గ్రామం పాత రికార్డుల్లో ఇనాం ఎస్టేట్ విలేజ్ కింద ఉంది. అప్పట్లో వెంకటగిరి రాజులు తమ వద్ద పనిచేసే వారికి భూములను ఇనాంగా ఇచ్చారు. అందులో రైతులు పంటలు సాగు చేసుకునేవారు. ఆ సమయంలో ఏర్పడిన దామినేడులో పక్కా గృహాలు కట్టుకున్నారు. ఇదంతా వందేళ్ల క్రితం చరిత్ర. ప్రస్తుతం దామినేడులో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2005, 2006లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడ 50 ఎకరాలను తీసుకుంది. ఆ సమయంలో స్థానికులు తమ నివాసాలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అప్పటి తహశీల్దార్ సురేంద్రబాబు అంగీకరించినా వారికి ఇంతవరకూ పట్టాలు దక్కలేదు. జాతీయ రహదారితో భారీ డిమాండ్ పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారి ఏర్పాటుతో దామినేడు పరిధిలోని భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. భూముల కోసం పలువురు వ్యాపారులు, ఉద్యోగులు వరుసకట్టారు. కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో తిరుపతి రూరల్ మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ భూములు వివాదాస్పదంగా మారాయి. మూడు నెలలకు ఒకసారి నోటీసులు... బెదిరింపులు దామినేడు గ్రామస్థులు తనకు చెందిన 17 ఎకరాలను కబ్జా చేశారంటూ తిరుపతి రూరల్ మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు 2014 అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు. ఆ భూములను ఆయన 2014 జూలైలో కళావతి రాజేంద్రన్ అనే మహిళ నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారని గ్రామస్థులు తెలిపారు. తమపై కృష్ణమూర్తి తరచూ దౌర్జన్యం చేయటం, పోలీసులతో బెదిరించటం, అరెస్టులు చేయించటం లాంటి చర్యలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కృష్ణమూర్తి చెబుతున్న భూములకు సంబంధించి 7 ఎకరాల్లో గ్రామస్థులు ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తుండటం గమనార్హం. మరో 10 ఎకరాలకు ఫెన్సింగ్ వేసిన కృష్ణమూర్తినాయుడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 100 మందికి ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నోటీసులు ఇవ్వటం, పోలీసులతో బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు. పైసా పైసా కూడబెట్టి కొందరు, అప్పులు చేసి మరి కొందరు పక్కాగృహాలు నిర్మించుకున్నామని దామినేడు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 అక్టోబర్ వరకు భూముల గురించి పట్టించుకోని వారు టీడీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యం చేయటం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రద్యుమ్న హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. -
పీజీ సెంటర్ కళాశాల స్థలం కబ్జా
కావలి : విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ కళాశాలకు చెందిన మూడు ఎకరాల స్థలాన్ని పేరుమోసిన కాంట్రాక్టర్ ఒకరు కబ్జా చేశారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి అన్నారు. పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లుగా ఆక్రమించిన విషయాన్ని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ దష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందన్నారు. రూ.18 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా వర్సిటీ వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆక్రమణల చుట్టూ కంచె వేసి విద్యార్థులను అటువైపుగా వెళ్లకుండా చేశారని ఆవేదన చెందారు. ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి మనోజ్, నాని, శ్రీను, మణి, రమేష్ పాల్గొన్నారు. -
బొందలగడ్డపై గద్దలు!
♦ ఐదు వేల గజాల స్థలానికి ఎసరు ♦ మార్కెట్ విలువ రూ. ఐదు కోట్లకు పైమాటే.. ♦ కబ్జానుంచి కాపాడాలని స్థానికుల విన్నపం వికారాబాద్ : విలువైన స్థలం కబ్జాకోరల్లో చిక్కుకుంది. మున్సిపల్ పరిధిలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు వారికి అబ్బినంత కబ్జా చేయడానికి సిద్ధమవుతున్నారు. చట్టబద్ధంగా తప్పించుకునేం దుకు అన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని ఆక్రమించుకునేందుకు తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ స్థలాలు అక్రమార్కుల చెంతకు చేరిన విషయం అనేకమార్లు పత్రికల్లో వచ్చినా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. గతంలో మున్సిపల్ స్థలం కబ్జా చేసి భూ బకాసురులు ఇళ్ల నిర్మాణాలు చేశారు. సమాధుల స్థలంపై కన్నేసిన భూబకాసురులు రామయ్యగుడ ఎంఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225లో 5 వేల గజాలకు పైగా స్థలం ఉంది. ఇది అప్పట్లో ప్రభుత్వం ఎంఐజీ, ఎల్‌ఐజీలో ఉంటున్న ప్రజలకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను శ్మశానవాటికకు స్థలాన్ని హౌజింగ్ బోర్డు వారు కేటాయించారు. ఇందులో ఇప్పటికే అనేక మంది చనిపోతే అక్కడే సమాధులను ఏర్పాటు చేశారు. సమాధులు సుమారుగా 10 నుంచి 15 వరకు ఒకేచోట ఉన్నాయి. మిగిలిన స్థలం మాత్రం హాట్‌కేక్‌లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి. ఈ స్థలం సుమారుగా 5 వేల నుంచి 6 వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో భూబకాసురుల కన్ను గ్రేవీయార్డుపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ సొంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువు మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలం కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించారు. ఈ మేరకు సంబంధిత స్థలం రికార్డుల ఫైల్ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన వారే ఇలా చేస్తే ఎలా అని ప్రజలు నిలదీస్తున్నారు. సబ్‌కలెక్టర్ స్పందించి గ్రేవీయార్డుకు కేటాయించిన ఖాళీస్థలం చుట్టూ పెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూడాలని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.