పరిహారం కోసం. | Farmer Innovative Protest for Compensation | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం..

Published Mon, Apr 8 2019 3:07 PM | Last Updated on Mon, Apr 8 2019 3:07 PM

Farmer Innovative Protest for Compensation - Sakshi

నిరసన తెలుపుతున్న రైతు సుందర్‌లాల్‌పాసి


ఇల్లెందుఅర్బన్‌(భద్రాద్రి కొత్తగూడెం): ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీ విస్తరణలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూమి కోల్పోయామని, పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఓ రైతు ఆదివారం పట్టణంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి 47 లెవల్‌ఫిల్టర్‌ బెడ్‌ సమీపంలో వ్యవసాయ భూమి కలిగిన రైతు సుందర్‌లాల్‌పాసి ఎడ్లబండిపై ప్రయాణిస్తూ సింగరేణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన సెంటర్‌ల్లో తమకు జరిగిన ఆవేదనను ప్రజలకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను సాగు చేసుకుంటున్న భూమికి రెవెన్యూ అధికారులు పట్టా అందజేసినప్పటికీ సింగరేణి అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తమకు పరిహారం చెల్లించకపోతే కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామనిహెచ్చరించారు.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement