farmer compensation
-
రైతుల ఆదాయం పెరుగుతోంది
హిమ్మత్‌నగర్: రైతుల ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వివిధ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్లు మాత్రమే కాగా, ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు. మొట్టమొదటి సారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ రూ.1లక్ష కోట్ల మార్కు దాటిందన్నారు. ఈ పరిశ్రమల్లో కోటిన్నర మందికి ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు. సబర్కాంత జిల్లా హిమ్మత్‌నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుందని ఆయన చెప్పారు. -
పరిహారం కోసం.
ఇల్లెందుఅర్బన్(భద్రాద్రి కొత్తగూడెం): ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీ విస్తరణలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూమి కోల్పోయామని, పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఓ రైతు ఆదివారం పట్టణంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి 47 లెవల్ఫిల్టర్ బెడ్ సమీపంలో వ్యవసాయ భూమి కలిగిన రైతు సుందర్‌లాల్‌పాసి ఎడ్లబండిపై ప్రయాణిస్తూ సింగరేణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన సెంటర్ల్లో తమకు జరిగిన ఆవేదనను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను సాగు చేసుకుంటున్న భూమికి రెవెన్యూ అధికారులు పట్టా అందజేసినప్పటికీ సింగరేణి అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తమకు పరిహారం చెల్లించకపోతే కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామనిహెచ్చరించారు. -
లంచం ఇచ్చేందుకు భిక్షాటన..
వెలుగోడు: అధికారులకు లంచం ఇవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలసి భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన తెలిపాడు ఓ రైతు. ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు కాగా.. వారిలో వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు 25 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, దీన్ని సమీప బంధువు ఆక్రమించాడని రాజు ఆరోపిస్తున్నాడు. తన భూమి తిరిగి ఇప్పించాలని రాజు కోరగా వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెలుగోడు పట్టణంలో రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని భిక్షాటన చేయడం ప్రారంభించారు. బ్యానర్‌పై ‘దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా’ అని రాసి ఉంది. రాజు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు. -
కలెక్టర్ అధికార వాహనం సీజ్
యవట్మాల్: రైతుకు నష్టపరిహారం చెల్లించనందుకు జిల్లా కలెక్టర్ అధికార వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్రలో యవట్మాల్ జిల్లాలో సివిల్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ జిల్లా కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. 1999లో మహారాష్ట్ర జీవన్ ప్రాధికారణ్.. చాప్దో ప్రాజెక్టు కోసం రామ్‌నగర్‌కు చెందిన రైతు ఛగన్ రాథోడ్ తల్లి నుంచి 10 హెకార్ల భూమి సేకరించింది. ఇందుకుగాను అప్పట్లో ఆమెకు నష్టపరిహారం చెల్లించారు. అయితే నష్టపరిహారం మరింత పెంచాలని ఛగన్ రాథోడ్ కోర్టును ఆశ్రయించగా, మరో 13.30 లక్షలు అతనికి చెల్లించాల్సిందిగా 2010లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని ఎంజేపీ ఛగన్‌కు చెల్లించలేదు. దీంతో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. వడ్డీతో సహా 29.84 లక్షల రూపాయలు రైతుకు చెల్లించాల్సిందిగా ఇటీవల ఎంజేపీని ఆదేశించింది. అయినా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రైతుకు నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఎంజేపీ ఈఈ దినేశ్ బోర్కర్ చెప్పారు.