గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో ఓ ఆర్టీసీ బస్సు నడిచి వెళుతున్న వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రైవర్‌గా విధుల్లోకి చేరిన ఓ వ్యక్తి మొదటి రోజే నిర్లక్ష్యంగా బస్సును నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. గాజువాక 60 అడుగుల రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేసే వెంకట నాగేశ్వరరావు (55) శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పాత గాజువాక జాతీయ రహదారి పైపు వెళుతున్నాడు.
అదే సమయంలో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో ఆర్టీసీ (మరమ్మతులు చేసే) బస్సు ఆగింది. దాని వెనుక నుంచి నాగేశ్వరరావు రోడ్డు దాటుతుండగా సింహాచలం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొంది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్యలో నాగేశ్వరరావు నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా, బస్సు నడిపిన డ్రైవర్ గురువారమే పరీక్షలో నెగ్గి శుక్రవారం విధుల్లో చేరినట్టు సమాచారం.
పాదచారిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Published Fri, May 8 2015 9:03 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement