venkata nageswara rao
-
అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే..
సాక్షి, పశ్చిమ గోదావరి : ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసి కాపు ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు కూడా నోరుమెదపని పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎనభై శాతం హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వర్ రావు విమర్శించారు. వైఎస్ జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుక్లెట్ విడుదల చేయడంపై ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి, దోపిడీ లేని పాలన అందిస్తుంటే టీడీపీ, జనసేనలకు మింగుడుపడడం లేదన్నారు. చంద్రబాబు పాలనలో ఆరు వందల హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అడగని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట్లాడటంలో ఆయన విజ్ఞత ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు కూడా పెదవి విప్పని పవన్ కల్యాణ్‌కు గత ప్రభుత్వం తొమ్మిది నెలలు ఇసుక దొరక్కుండా చేసిన విషయం తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. రూపాయి కూడా లేకుండా చంద్రబాబు ఖజానా ఖాళీ చేసి అప్పజెప్పాడని, వైఎస్ జగన్ ఎంతో ఓర్పుతో ప్రతీ హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లుగా ఇప్పటికే ఐదు లక్షల అరవై ఉద్యోగాలు, సుమారు రెండు లక్షల గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. త్వరలో పెద్ద ఎత్తున కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. మంచి పనులు చేస్తుంటే మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా విషం చిమ్మవద్దని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. -
భళా రాజన్న క్యాంటీన్
సాక్షి, పశ్చిమగోదావరి(తణుకు) : తణుకులో రాజన్న క్యాంటీన్ నిర్వహణపై పేదల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చొరవతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. రూ.ఐదుకే పేదల కడుపు నింపుతున్నారు. నిత్యం 250 మందికి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. తొలుత ఎమ్మెల్యే కారుమూరి తన సొంత నిధులతో క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయనకు చేదోడువాదోడుగా నియోజకవర్గంలోని నాయకులు కూడా నిలిచారు. దీంతో రోజుకో దాత పేరుతో రాజన్న క్యాంటీన్ నిర్వహణ ప్రారంభించారు. రాబోయే రోజుల్లోనూ దీని నిర్వహణకు నిధులు సమకూరడంతో గతనెల 31 నుంచి ప్రారంభించిన క్యాంటీన్ విజయవంతంగా నడుస్తోంది. రాబోయే వంద రోజులకు సరిపడా నిధులను సమకూర్చిన వైఎస్సార్ సీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. 18 మందితో కమిటీ తణుకు పట్టణంలో రాజన్న క్యాంటీన్ నిర్వహణకు 18 మంది పార్టీ నాయకులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిత్యం 250 మందికి భోజనం అందించడానికి వీలుగా ప్రణాళికసిద్ధం చేశారు. మొదటి రోజు భోజనానికి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు భరించడంతో నియోజకవర్గంలోని కొందరు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చారు. దీంతో సుమారు 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించిన కమిటీకి గౌరవాధ్యక్షులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధ్యక్షులుగా నార్గన సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మారిశెట్టి శంకర్, కలిశెట్టి శ్రీనివాసు, చిక్కాల మోహన్ వ్యవహరిస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో ఎవరైనా దాతలు లేదా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకునే వారు పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే కమిటీని సంప్రదించాలని వారు కోరుతున్నారు. నాణ్యతతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో పరిమితి లేకుండానే పేదలకు భోజనం వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఒక స్వీటు, మూడు రకాల కూరలు, సాంబారు, పెరుగుతో పేదలకు భోజనం అందజేస్తున్నారు. మరోవైపు దాతల పేర్లు ఆరోజు క్యాంటీన్లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. దాతల సహకారం అభినందనీయం పేదలకు అన్నం పెట్టేందుకు తణుకులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించాం. దాతల సహకారంతో దీనిని మొదలుపెట్టాం. రూ. 5కే భోజనం పెట్టేందుకు వైఎస్సార్ సీపీ నాయకులకు తోడు దాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రస్తుతం 250 మందికి భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతాం. – కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్యే, తణుకు సంతోషంగా ఉంది... ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రాజన్న క్యాంటీన్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. దాతలు తమ పేరున భోజనం పెట్టడానికి ముందుకు వస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకుని పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే రాజన్న క్యాంటీన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. – మారిశెట్టి శివశంకర్, కమిటీ ఉపాధ్యక్షులు, తణుకు నాణ్యతలో రాజీపడం... పేదలకు అన్నం పెట్టే క్రమంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోం. పేదలకు ఉచితంగానే భోజనం అందించాలని భావిస్తున్నప్పటికీ నామమాత్రంగానే రూ.5 వసూలు చేస్తున్నాం. పరిమితి లేకుండా ఎంత భోజనం వడ్డించడానికి అయినా వెనుకాడటంలేదు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మనసున్న దాతలు మరింత మంది ముందుకు రావాలి. – చిక్కాల మోహన్, కమిటీ సభ్యులు, తణుకు -
పాదచారిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో ఓ ఆర్టీసీ బస్సు నడిచి వెళుతున్న వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రైవర్‌గా విధుల్లోకి చేరిన ఓ వ్యక్తి మొదటి రోజే నిర్లక్ష్యంగా బస్సును నడిపి ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. గాజువాక 60 అడుగుల రోడ్డులోని ఓ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పనిచేసే వెంకట నాగేశ్వరరావు (55) శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పాత గాజువాక జాతీయ రహదారి పైపు వెళుతున్నాడు. అదే సమయంలో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో ఆర్టీసీ (మరమ్మతులు చేసే) బస్సు ఆగింది. దాని వెనుక నుంచి నాగేశ్వరరావు రోడ్డు దాటుతుండగా సింహాచలం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొంది. రెండు ఆర్టీసీ బస్సుల మధ్యలో నాగేశ్వరరావు నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా, బస్సు నడిపిన డ్రైవర్ గురువారమే పరీక్షలో నెగ్గి శుక్రవారం విధుల్లో చేరినట్టు సమాచారం. -
దెందులూరు.. టీడీపీ బేజారు
దెందులూరు, న్యూస్‌లైన్ : దండ నాయకులు నివసించిన ప్రాంతంగా.. వేంగి రాజుల ప్రధాన కేంద్రంగా భాసిల్లిన దెందులూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. నియోజకవర్గంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం జీవనాధారంగా బతుకుతున్నారు. చేపలు చెరువులు విస్తారంగా ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాలతో పాటు ఏలూరు రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలతో నియోజకవర్గం ఏర్పడింది. 2.66 లక్షల జనాభా ఉండగా వీరిలో అత్యధిక శాతం మంది బీసీలు. ఓటర్లలో కూడా వీరిదే ఆధిక్యత. అయినా బీసీలు, ఎస్సీలు ఇక్కడ పల్లకీ మోసే బోయిలుగానే మిగిలిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడంతో ఆయా వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్, తణుకు ఎమ్మెల్యేగా పనిచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి, స్థానిక ప్రజలతో ఆయనకున్న సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం, నిధులు మం జూరులో చొరవ వంటి అంశాలు కారుమూరికి అనుకూలంగా మారాయి. దీనికితోడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన పనులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదరణ, ఆ పార్టీ మేనిఫెస్టో, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల ఆదరణ వైసీపీ అభ్యర్థి విజయానికి దోహదపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కారుమూరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకరరావు ప్రచారంలో వెనుకపడటంతోపాటు ముఖ్యనేతలు టీడీపీని వీడటం ప్రతికూలంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంటి వీరేంద్రప్రసాద్ నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు. కారుమూరి దూకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొల్లేరు దళితవాడలు, బీసీ, మైనార్టీ ప్రాంతాల్లో కారుమూరికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. వైసీపీ మేనిఫెస్టో నచ్చి పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కారుమూరికి మద్దతు పలుకుతున్నారు. పలువురు ముఖ్య నేతలు కారుమూరి విజయం కోరుతూ గ్రామగ్రామానా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో అధిక శాతం బీసీలు, ఎస్సీలు కారుమూరి వెంటే ఉండటం అనుకూల అంశంగా ఉంది. కారుమూరి పరిపాలన దక్షత, అభివృద్ధికి విజన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ, మహానేత వైఎస్సార్‌పై అభిమానం కారుమూరి విజయానికి దోహదపడనున్నాయి. కారుమూరి విజయం నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చింతమనేనికి చింతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకరరావు ఎదురీదుతున్నారు. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో టీడీపీకి సేవలందించిన పలువురు నాయకులు, కార్యకర్తలు దూరం కావడంతో పార్టీ కేడర్ అయోమయ స్థితిలో ఉంది. ముఖ్య నేతలు కమ్మ శివరామకృష్ణ, వడ్లపట్ల శ్రీనివాసరావు, కొలనువాడ కృష్ణంరాజుతో పాటు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడటం ప్రతికూల అంశంగా ఉంది. కాంగ్రెస్ నామమాత్రపు పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి వీరేంద్రప్రసాద్ నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీని వీడారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రుల ఆగ్రహాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు దక్కడం కూడా కష్టంగా కనిపిస్తోంది. మాగంటి ప్రచారం వెలవెలబోవడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు.