జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఓ డబ్బాలోని గుర్తు తెలియని ద్రావణాన్ని మద్యంగా భావించిన కొందరు వ్యక్తులు దానిని సేవించారు. అది విషతుల్యమైనది కావడంతో నలుగురు ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.