విశాఖపట్టణం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న కేంద్రం వైఖరిపై ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అందులోభాగంగా ఆ పార్టీలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. గాజువాకలో బంద్ నిర్వహిస్తున్న కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తలు మొత్తం 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు.