
సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి విహహం చేసుకున్న జంట ఆశలన్నీ కొంత కాలంలోనే ఆవిరైపోయాయి. నూతన దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాజువాక పెంటయ్యనగర్‌కు చెందిన నరేంద్రకుమార్, దిల్లేశ్వరి తల్లిదండ్రులకు తెలియకుండా గత జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. ఒంగోలులో వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఆటోనగర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసే నరేంద్రకుమార్ జీతం అంతంతమాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదాలు చేటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన దంపతులు శుక్రవారం ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సరిపడా ఆదాయం రావట్లేదని, భవిష్యత్తుపై బెంగతో చనిపోయినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఈ జంట తిరిగి గాజువాకలో నివసిస్తున్నట్లు వారి తల్లిదండ్రులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment