40 లక్షల అప్పు.. బాలుడి కిడ్నాప్‌ | Six Years Boy Kidnap In Gajuwaka | Sakshi
Sakshi News home page

40 లక్షల అప్పు.. బాలుడి కిడ్నాప్‌

Published Sun, Nov 1 2020 12:00 PM | Last Updated on Sun, Nov 1 2020 1:40 PM

Six Years Boy Kidnap In Gajuwaka - Sakshi

సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఆటోనగర్‌లో బాలుడి కిడ్నాప్‌ ఒక్కసారిగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన నరేష్‌ యాదవ్‌ విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపున్నారు. వ్యాపారం నిమిత్తం ఓ వ్యక్తి వద్ద ఇటీవల 40 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ కారణంగా అప్పు తిరిగి చెల్లించడంలో కొంత ఆలస్యమైంది. ఈ క్రమంలోనే డబ్బు తిరిగి చెల్లించాలని వ్యాపారి తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. అయినప్పటికీ నరేష్‌ చెల్లించకపోవడంతో.. అతని ఆరేళ్ల కుమారుడిని ఆదివారం ఉదయం కిడ్నాప్‌ చేశాడు. వెంటనే తండ్రి నరేష్‌ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గంట వ్యవధిలోనే కేసును ఛేదించారు. దుండుగుల నుంచి బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. ఐదుగురుని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement