విశాఖపట్టణం సమీపంలోని గాజువాకలో గంజాయితో సంచరిస్తున్న ఓ హిజ్రాను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
గాజువాక: విశాఖపట్టణం సమీపంలోని గాజువాకలో గంజాయితో సంచరిస్తున్న ఓ హిజ్రాను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడ్ని స్టేషన్‌కు తరలించారు. అయితే, స్టేషన్‌కు తీసుకెళ్లిన కొంతసేపటి తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లాలని చెప్పి హిజ్రా పారిపోయినట్టు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు బయటకు వెల్లడించే విషయంలో పోలీసులు తటపటాయిస్తున్నారు.