200 కిలోల గంజాయి స్వాధీనం | 200 kg of marijuana seized | Sakshi
Sakshi News home page

200 కిలోల గంజాయి స్వాధీనం

Published Fri, Dec 2 2016 5:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

రవాణాకు సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జి.మాడుగుల(విశాఖపట్నం): అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం కుంబిడిసింగి గ్రామం నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా.. గంజాయి తరలించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement