అక్టోబర్‌ 4న గాజువాకలో కార్మిక ప్రదర్శన : అశోక్ బాబు | Workers procession On October 4 in Gajuwaka | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 4న గాజువాకలో కార్మిక ప్రదర్శన:అశోక్ బాబు

Published Sat, Sep 28 2013 5:19 PM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

అక్టోబర్‌ 4న గాజువాకలో కార్మిక ప్రదర్శన : అశోక్ బాబు

అక్టోబర్‌ 4న గాజువాకలో కార్మిక ప్రదర్శన : అశోక్ బాబు

సమైక్య రాష్ట్రం కోసం ఏపీఎన్‌జీవోలు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కార్మికులు మద్దతు తెలిపారు.

విశాఖపట్నం: సమైక్య రాష్ట్రం కోసం  ఏపీఎన్‌జీవోలు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కార్మికులు మద్దతు తెలిపారు. ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు ఈరోజు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తమ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. అందుకు వారు అంగీకరించారు.

సమావేశం అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ అక్టోబర్‌ 4న గాజువాకలో వేలాది మంది కార్మికులతో కార్మిక ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్‌ 5న నగరంలో కేంద్ర ప్రభుత్యశాఖ ఉద్యోగుల బహిరంగ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

ఇదిలా ఉండగా,  సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా కోర్టు ఎదుట  కోర్టు ఉద్యోగులు కేసీఆర్‌ దిష్టి బొమ్మ దహనం చేసిశారు. ఆ తరువాత వారు  బ్యాంకులను, కేంద్ర కార్యాలయాలను మూసివేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement