
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా మారిన గాజువాక నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత దొడ్డి రమణ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు సమక్షంలో ఆయన ఆదివారం పార్టీలో చేరారు. ఆయనతోపాటు నాలుగు వేలమంది కార్యకర్తలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయంగా కనిపిస్తుండటం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మల్యేలతోపాటు పలు పార్టీల నేతలు సైతం వైఎస్సార్‌సీపీలోకి క్యూ కట్టారు.