సాక్షి, విశాఖపట్నం: సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల పార్టీని వీడగా తాజాగా విశాఖపట్నానికి చెందిన మరో నాయకుడు జనసేనకు గుడ్‌బై చెప్పారు. గాజువాక సీనియర్ నాయకుడు కరణం కనకారావు బుధవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనకారావును పార్టీ కండువాతో సాదరంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆహ్వానించారు. కనకారావుతో పాటు 200 మంది జనసైనికులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజవర్గాల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నందుకు నిరసనగా ఇటీవల జనసేన పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. (చదవండి: జనసేనకు గట్టి షాక్.. ‘జేడీ’ ఔట్)
Comments
Please login to add a commentAdd a comment