
రెండోసారి పట్టుబడితే జైలుకే..
- ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
- బైక్‌రేసర్లకు కౌన్సెలింగ్
బంజారాహిల్స్ : బైక్ రేసింగ్‌లో రెండోసారి పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బైక్ రేసర్లు, వారి తల్లిదండ్రులకు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 16 మంది బైక్‌రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారికి ఏసీసీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
పిల్లలు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు, ఇంటికి ఎప్పుడు వస్తున్నారు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటూ తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి బైక్‌రేసర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, ఇందుకోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టుబడ్డ వారంతా టోలిచౌకి, కూకట్‌పల్లి, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. కార్యక్రమంలో సీఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.