రాయల్ సందేశం... | Royal en filed very crazy about Youth | Sakshi
Sakshi News home page

రాయల్ సందేశం...

Published Thu, Jul 10 2014 3:08 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రాయల్ సందేశం... - Sakshi

రాయల్ సందేశం...

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. బైక్ రేసింగ్‌లూ, స్పీడ్‌పై బెట్టింగ్‌లూ తగ్గాలంటే బైకర్లే చె ప్పాలి. అదీ క్రేజీ బైక్‌తోనే. అదే పని చేస్తున్నారు డేవిడ్.
 
 హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. వాండరర్స్ క్లబ్, బుల్లెట్ క్లబ్‌లే దీనికి సాక్షి. ఈ క్లాసీ అండ్ క్రేజీ బైక్‌ను ప్రాణ సమానంగా ప్రేమించేవాళ్లలో టీనేజర్స్ నుంచి ఓల్డేజ్‌దాకా ఉన్నారు. అమ్మాయిలు సైతం ‘బుల్లెట్స్’లా దూసుకుపోతుండటం చూస్తూనే ఉన్నాం. మ్యూజిక్ ట్రైనర్‌గా ఉన్న డేవిడ్.. సిటీలోని చాలా మందిలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ చేసే మ్యాజిక్‌కు అభిమాని కూడా. ‘బైక్ మీద ఇష్టం ఉండడం సహజం. అయితే అది మన ప్రాణాలు తీసేంతో, అంగవైకల్యం పాలు చేసేంతో కాకూడదు’ అంటారు డేవిడ్. తన సొంత అన్నయ్య ఒకరు రోడ్డు ప్రమాదం కారణంగా వైకల్యం బారిన పడటాన్ని గుర్తుంచుకున్న డేవిడ్... తన ఇష్టమైన బైక్ ద్వారా బైక్ ప్రియులకు ఓ చక్కని చిరు సందేశం ఇస్తున్నారు.
 
 ఎంజాయ్‌ది రైడ్... బీ ఆన్ రోడ్...
 అనేది డేవిడ్ ఫిలాసఫీ. తెలుగు సామెతల్లా చెప్పాలంటే... గాల్లో తేలినట్టు ఆనందించు కాని రోడ్డు మీదే ఉన్నానని గుర్తించు. ఈ సందేశాన్ని చెప్పడానికి ఆయన తన బైక్‌కు హెడ్‌లైట్ స్థానంలో ఒక పుర్రె బొమ్మని సిల్వర్ మెటల్‌తో ఏర్పాటు చేశారు. విండ్‌షీల్డ్ మీద ‘స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్’ అంటూ మెరిసే అక్షరాలను ముద్రించారు. ‘దీని కోసం ఓ 3 వేలు అదనంగా ఖర్చయిందంతే. కాని నా ఆలోచనను ఒక్క బైక్‌లవర్ అర్థం చేసుకున్నా... దాని వల్ల కలిగే మంచి ప్రయోజనం ముందు ఇదేపాటి?’ అంటూ..‘ నేను సొంతంగా కూర్చే పాటల్లో కూడా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తాను’ అంటూ చెప్పారాయన.
-  సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement