
చెన్నై : తమిళనాడులోని చెన్నై మెరీనా తీరంలో బైక్ రేసర్ల హల్‌చల్ చేశారు. బీచ్ రోడ్డులో అర్ధరాత్ని దాటక పలువురు యువకులు బైక్ రేసులు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై నుంచి జారిపడ్డ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అయితే బైక్ రేస్‌లకు అనుమతి లేకపోయినప్పటికీ.. నిబంధనలను అతిక్రమిస్తూ మెరీనా తీరంలో దొంగచాటుగా బైక్ రేసుల నిర్వహించటం పరిపాటిగా మారింది. వీటిపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి బైక్ రేస్‌లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.