
తిరువొత్తియూరు: చెన్నై మెరీనా తీరంలోని శ్రామికుల విగ్రహం వెనుక ఆదివారం ఉదయం 7.30 గంటలకు గుర్తు తెలియని సుమారు 27 సంవత్సరాలు వయసు కలిగిన యువకుని మృతదేహం ఒడ్డుకు చేరింది. తరువాత ఉదయం 11.15 గంటలకు ఎంజీఆర్ సమాధి వెనుక భాగంలో జేఎన్‌ఎన్ కళాశాలలో చదువుతున్న కన్నన్ మృతదేహం ఒడ్డుకు చేరింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 సమయంలో స్నేహితుడు జయకుమార్‌తో స్నానం చేస్తున్న సమయంలో నీటిలో గల్లంతైన జయచంద్రన్ మృతదేహం ఒడ్డుకు చేరింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అన్నాసమాధి పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 8 గంటల వ్యవధిలో 3 మృతదేహాలు ఒడ్డుకు చేరడం పర్యాటకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సముద్రతీరంలో గస్తీ చేస్తున్న పోలీసులు కొన్ని రోజులుగా రాకపోవడంతో ఈ సంఘటనలు జరుగుతున్నాయని పలువురు వాపోయారు.