బోరబండలో పోలీసుల కార్టన్ సెర్చ్ | Police carden search at borabanda | Sakshi
Sakshi News home page

బోరబండలో పోలీసుల కార్టన్ సెర్చ్

Published Sat, Jan 24 2015 11:28 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Police carden search at borabanda

హైదరాబాద్‌  బోరబండ ప్రాంతంలోని కార్మికనగర్‌ ,బంజారానగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ను నిర్వహించారు. అర్థరాత్రి రెండు గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు తెల్లవారుజామున 4 గంటలవరకూ సాగింది. వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో సుమారు 180 మంది పోలీసులు ఇంటింటినీ క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు నిర్వహించిన ప్రాంతంలో గుడుంబా ఏరులైపారుతోందన్న సమాచారం పోలీసులు అందుకున్నారు.

దీనిపై చాలాసార్లు ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీనికి తోడు ఇక్కడ రౌడీలు కూడా చాలా మంది పాత నేరస్తులు తలదాచుకున్నట్టు విశ్వసనీయ వరక్గాల ద్వారా పోలీసులు సమాచారం అందుకున్నారు. ప్రధానంగా  ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసిస్తున్న పాత నేరస్తులే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. అక్రమంగా పెట్రోల్‌ నిల్వ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement