
మలక్‌పేటలో పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం 150 మంది పోలీసులు మలక్‌పేట పరిధిలోని సలీమ్‌నగర్, మూసారంబాగ్‌లలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 60 బైకులు, 5 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.