మచిలీపట్నం: కృష్ణాజిల్లా పెడన పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు ఉదయం వరకు సాగాయి. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో పట్టణంలోని ప్రతి ఇంటినీ క్షణ్ణంగా పరిశీలించారు. అందులోభాగంగా 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెడనలో ఇటీవల కాలంలో చోరీలు అధికమైనాయి. దాంతో పట్టణ ప్రజలు పోలీసుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.