ఓయూ పరిధిలో పోలీసుల తనిఖీలు
Published Thu, Jul 27 2017 12:09 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
హైదరాబాద్: ఈస్ట్ జోన్ సికింద్రాబాద్ సీతాఫల్ మండి మనికేశవ నగర్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గురువారం కార‍్డన్ సెర్చ్ నిర‍్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు అధికారులతో గురువారం ఉదయం 5:00 గంటల నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 62 బైక్‌లు సీజ్ చేశారు. గుర్తింపు, లేబుల్స్ లేని హార్బల్స్ ఫ్లేవర్స్ హ్యాండోవర్ చేసుకున్నారు.
గుర్తింపు కార్డులు లేని 20 మంది అనుమానితులను , ఇద‍్దరు సెల్ ఫోన్ దొంగలను పట్టుకున్నామని .. జార్ఖండ్ , బీహార్ వచ్చిన వారిలో కొంత మందికి ఆధార్ కార్డులు లేని వారిని విచారించమని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ , అనుమానితులను గుర్తించడం కోసం ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని , మొబైల్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ రావడంతో నిందితులను పట్టుకోగలుతున్నామని డీసీపీ పేర్కొన్నారు.
Advertisement
Advertisement