
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థి మురళీ రాసిన సూసైడ్ లేఖ లభించింది. తొలుత అక్కడ ఎలాంటి సూసైడ్ లెటర్ లభ్యం కాలేదని వదంతులు ప్రచారమైనా ఎట్టకేలకు లేఖ బయటకు రావడంతో తల్లిదండ్రులను, తోటి విద్యార్థులను కలవరానికి గురిచేసింది. 'ఈ టెన్షన్ నా వల్ల కాదు, ఐ యామ్ సారీ, గుడ్ బై ఎవ్రీ వన్. ఐ వాంట్ టు టేక్ రెస్ట్ ఇన్ పీస్. ఐ యామ్ రియల్లీ హ్యాపీ విత్ మై డెత్, ఐ యామ్ సారీ అమ్మ, గుడ్ బై' అంటూ ఆత్మహత్యకు ముందు విద్యార్థి లేఖ రాశాడు. సూసైడ్ లెటర్ లభ్యం కావడంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.
మరోవైపు విద్యార్థి మురళీ ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మానేరు వసతిగృహంలోకి వెళ్లిన పోలీసులను విద్యార్థులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మురళీ మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థి మృతి నిజంగా బాధాకరమని, మురళీ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. త్వరలోనే వాస్తవాలు బటయపడతాయని ఓయూ వైస్ ఛాన్స్‌లర్ రాంచంద్రం అన్నారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఎంఎస్సీ ఫస్టియర్ స్టూడెంట్ మురళి ఉస్మానియా వర్సీటీలోని మానేరు హాస్టల్‌లో రూమ్‌నెంబరు 159లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని తీవ్ర ఒత్తిడికిలో ఉన్న మురళీ మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందాడని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment