కామారెడ్డిలో కార్డన్ సెర్చ్
Published Tue, Dec 27 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మంగళవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీలు డీఎస్పీ ప్రసన్నరాణి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సోదాల్లో ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎలాంటి పత్రాలు లేని ఒక ఓమ్ని వాహనాన్ని, 12 ఆటోలను, 100 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement