
తూర్పు గోదావరి : కత్తిపూడిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడి కుటుంబం లక్ష్యంగా చేసుకొని కత్తులతో దాడి జరిగింది. గొర్రెల రాజు అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంటిబాబు అతడి కుమారుడు నాగబాబు, భార్య లక్ష్మీపై కత్తులతో దాడికి దిగాడు. వారి కళ్లల్లో కారం చల్లి మరీ ఈ దాడికి పూనుకున్నాడు. ఈ దాడిలో చంటిబాబు మెడకు తీవ్ర గాయాలు కాగా కుమారుడు నాగబాబు, లక్ష్మీకి కూడా గాయాలయ్యాయి.
దీంతో వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చంటి బాబు ఒళ్లంతా రక్తసిక్తంగా మారింది. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొర్రెల రాజు భార్యకు చంటిబాబు కుమారుడికి అక్రమ సంబంధం ఉందనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. చంటిబాబు అన్నవరం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.