గురక సమస్యలకు చెక్‌ పెట్టే హైటెక్‌ రింగ్‌ | HiTech Ring That Could Finally Banish Your Snores | Sakshi
Sakshi News home page

గురక సమస్యలకు చెక్‌ పెట్టే హైటెక్‌ రింగ్‌

Published Mon, Oct 22 2018 12:08 PM | Last Updated on Mon, Oct 22 2018 12:13 PM

HiTech Ring That Could Finally Banish Your Snores - Sakshi

లండన్‌ : నిద్రలేమి, గురక సమస్యలను నియంత్రించేలా పరిశోధకులు హైటెక్‌ ఉంగరాన్ని రూపొందించారు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ రింగ్‌లో రక్తంలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ను గుర్తించే సెన్సర్లను అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధించే స్లీప్‌ అప్నియాకు రాత్రి వేళల్లో బ్లడ్‌ ఆక్సిజన్‌ రీడింగ్స్‌ పడిపోవడం ప్రధాన సంకేతంగా భావిస్తారు. అత్యాధునికంగా రూపొందిన ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్‌ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందించే వెసులుబాటు ఉంది.

తీవ్ర గురక సమస్యలు గుండె పోటు, స్ర్టోక్‌లకు దారితీసే క్రమంలో ఈ సమస్యను నివారించేందుకు హైటెక్‌ రింగ్‌ ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి మూడు రోజులకు ఓసారి ఈ ఉంగరానికి చార్జింగ్‌ చేస్తే సరిపోతుందని, ముఖ్యంగా ఒంటరిగా నిద్రించే వారికి ఈ హైటెక్‌ రింగ్‌ మేలు చేస్తుందని స్లీప్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ నీల్‌ స్టాన్లీ చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్‌లోకి రానున్న ఈ హైటెక్‌ రింగ్‌ ధర దాదాపు రూ 7500 ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement