
మామూలు గురకకూ, ఆప్నియాకు కాస్త తేడా ఉంటుంది. అదేమిటంటే... గురక వస్తుంటే ఆప్నియా ఉన్నట్లు కాదు. కానీ... ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. ఆప్నియా అంటే... దానివల్ల గుండెకు, మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అలా ఆక్సిజన్ అందనప్పుడల్లా... మెలకువ వచ్చేలా మెదడు దేహాన్ని ఆదేశిస్తుంటుంది. రాత్రి నాణ్యమైన నిద్ర ఉండకపోవడంతో పగలంతా జోగుతూ డల్‌గా ఉంటారు. ఈ ఆప్నియా రక్తపోటు పెరగడానికి, డయాబెటిస్ బాధితుల్లో చక్కెరలు నియంత్రణలో లేకపోవడానికీ, పక్షవాతానికీ దారితీసే ప్రమాదం ఉన్నందున దాన్ని నివారించుకోవాల్సిన అవసరముంది.
ఇలా తగ్గుతుంది... మంచి జీవనశైలితో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు ∙స్థూలకాయం ఉన్నవారు ఆరోగ్యకరమైన వ్యాయామంతో బరువు తగ్గడం ∙ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడం.