
కదిలే ఉంగరం!
ఉంగరాలందు.. కదిలే ఉంగరం వేరయా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన స్వర్ణకారుడు కొచ్చెర్ల శివవరప్రసాద్ ఓ కదిలే ఉంగరాన్ని రూపొందించారు. అది కూడా తాబేలు ఆకృతిలో.. నవరత్నాలు పొదిగిన ఈ ఉంగరానికి వెనుక ఓ మరను ఏర్పాటు చేశారు. మర తిప్పితే చాలు తాబేలు తల, కాళ్లు బయటకు వచ్చి లోపలికి వెళ్లేలా రూపొందించారు. 16 గ్రాముల బంగారం, నవరత్నాలతో ఈ ఉంగరాన్ని రూపొందించడానికి 20 రోజుల సమయం పట్టిందని శివవరప్రసాద్ తెలిపారు. వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాల్లో తిరిగేవారు తమిళనాడు తిరుపూర్ (తాబేలు) ఉంగరాలను ధరిస్తుంటారని, ఆ రాష్ట్రంలోనే వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో ఇలా కదిలే తాబేలు ఉంగరాన్ని తయారు చేసింది మాత్రం తానే అని చెపుతున్నాడు శివవరప్రసాద్.
- న్యూస్‌లైన్, తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి)