న్యూఢిల్లీ : బీసీసీఐ అధ్యక్ష పదవిపై సీనియర్ పరిపాలకులు శరద్ పవార్, రాజీవ్ శుక్లాలు ఆసక్తి చూపిస్తుండగా అనూహ్యంగా మరో పేరు తెర మీదికి వచ్చింది. బోర్డు చీఫ్‌ను ఎంచుకునే అవకాశం ఉన్న ఈస్ట్‌జోన్ తమ అభ్యర్థిగా జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈస్ట్‌జోన్‌లోని ఆరు సంఘాలు బెంగాల్, అస్సాం, జార్ఖండ్, ఒడిషా, త్రిపుర, నేషనల్ క్రికెట్ క్లబ్‌లు అమితాబ్‌కు మద్దతు పలకనున్నట్లు సమాచారం.