ఉంగరం మింగిన పసిబాలుడు
ఉంగరం మింగిన పసిబాలుడు
Published Mon, Apr 3 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
– తప్పిన ముప్పు
– కాపాడిన డాక్టర్ మధుసూదనరావు, శేషఫణి
నంద్యాల: నెలరోజులు కూడా నిండని పసిబాలుడు వెండి ఉంగరం మింగాడు. సకాలంలో వైద్యులు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. సోమవారం నంద్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అశోక్, లక్ష్మీదేవిలకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి గత నెల 8వ తేదీన మగబిడ్డ జన్మించాడు. హర్షవర్దన్‌గా నామకరణం చేసిన ఈ పసిబాలుడి వేలికి తల్లి లక్ష్మిదేవి ప్రేమతో వెండి ఉంగరం తొడిగింది. నోట్లో వేలు పెట్టుకున్న సమయంలో ఉంగరం కడుపులోకి పోయింది. కొద్ది సేపటి తర్వాత ఏడుస్తూ వాంతులు చేసుకోవడంతో అనుమానం వచ్చిన తండ్రి అశోక్ వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. హర్షవర్దన్‌కు ఎక్సరేలు తీసిన వైద్యులు ఉంగరం గొంతులోని అన్నాశయం వద్ద చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే కర్నూలు లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అశోక్ నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రముఖ అనస్థీయ స్పెషలిస్ట్ శేషఫణి, డాక్టర్ మధుసూదనరావు ఎండోస్కోపీ సర్జరీ ద్వారా హర్షవర్దన్ అన్నాశయంలోని ఉంగరాన్ని బయటకు తీశారు. బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement