ఉంగరం... సింగారం
ఫ్యాషన్‌కే ష్యాషన్‌గా ఉండాలనిపిస్తే... ఇదిగో ఇలాంటి పోకడలు పోతుంది! చేతికున్న అయిదు వేళ్లల్లో దేని స్థానం దానికే! అన్నిటికన్నా హొయలు పోయేది ఉంగరం వేలే! పేరులోనే ఉందికదా అందం.. కెంపు, పచ్చ, వజ్రం అన్నీ దాన్ని ధరించడానికే మోజు పడ్తుంటాయి... ఆ సోకులు చూసి ఈర్ష్యపడేనేమో... మిగిలిన వేళ్లూ ఉంగరాలు సింగారించుకోవడం మొదలెట్టాయి ఇలా! అయితే బంగారానికే ఫిక్స్ అయిపోకుండా మెటల్, ప్లాస్టిక్, స్టోన్, వుడ్, బోన్, గ్లాస్ జెమ్‌స్టోన్‌లాంటివాటికీ ప్రిఫరెన్స్ పెరిగింది. ఈ క్రేజీని క్యాష్‌చేసుకోవడంలో మార్కెట్టూ ముందుంది. అందుకే బర్త్‌స్టోన్స్ రింగ్స్, చాంపియన్‌షిప్‌రింగ్, కాక్‌టెయిల్ రింగ్, డాక్టోరల్‌రింగ పజిల్‌రింగ్, థంబ్ రింగ్‌లతో లేడీస్‌ని లేటెస్ట్ ట్రెండ్‌వైపు నడిపిస్తున్నాయి! ఇంకా చిత్రమేంటంటే.. రెండు వేళ్లకు ఒకేసారి ధరించేలా డబుల్ ఫింగర్ రింగ్ గింగుర్లుకొడుతోంది. అవిభక్త కవలలను పోలినట్టుండే ఈ ఉంగరం వేళ్లకు వన్నెతెస్తోంది. ఇవీ ఉంగరాల ఊసులు!
- శిరీష చల్లపల్లి