సౌత్‌ చైనా సీపై డ్రాగన్‌ డేగ కన్ను | Beijing plans remote satellites at South China Sea | Sakshi
Sakshi News home page

సౌత్‌ చైనా సీపై డ్రాగన్‌ డేగ కన్ను

Published Sat, Dec 16 2017 9:02 AM | Last Updated on Sat, Dec 16 2017 9:02 AM

 Beijing plans remote satellites at South China Sea - Sakshi

బీజింగ్‌: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక శాటిలైట్‌ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్‌ చైనా సీలోని చైనాకు సంబంధించిన హైనాన ద్వీపం కేంద్రంతా.. రిమోట్‌ శాటిలైట్‌ సెన్సింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధికారలు ప్రకటించారు.


శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ మిషన్‌ 2019లో మొదలు పెడుతున్నట్లు శాన్యన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ డైరెక్టర​ యాంగ్‌ తియాన్‌లాంగ్‌ తెలిపారు. ఈ మిషన్‌లో భాగంగా సౌత్‌ చైనా సీపై మూడు మొదట ఆప్టికల్‌ శాటిలైట్స్‌ ప్రయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు.  ఇదిలాఉండగా..  2021 నాటికల్లా..  ఇకమరో మూడు ఆప్టికల్‌ శాటిలైట్లు, రెండు హైపర్‌స్పెక్ట్రాల్‌ శాటిలైట్లు, మరో రెండు ఎస్‌ఏఆర్‌ రకానికి చెందిన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని నితరంతం డేగ కళ్లతో కాపు కాస్తుంటాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement