remote sensing satellite
-
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా తన దూకుడు తనాన్ని కొనసాగిస్తూనే ఉంది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి చైనా నవంబర్ 6న 3 కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారిక మీడియా తెలిపింది. యోగన్-35 విభాగానికి చెందిన ఈ ఉపగ్రహాలను లాంగ్ మార్చి-2డి క్యారియర్ రాకెట్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ సిరీస్ రాకెట్స్ ద్వారా చేపట్టిన 396వ మిషన్‌గా ఈ ప్రయోగం నిలిచింది. 2019 మార్చిలో లాంగ్ మార్చి 3బీ రాకెట్ విజయవంతం కావడంతో చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300వ ప్రయోగంగా అది నిలిచింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్ క్యారియర్ రాకెట్ సిరీస్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు 96.4 శాతం సక్సెస్ అయ్యాయి. లాంగ్ మార్చ్ రాకెట్ మొదటి 100 ప్రయోగాలను పూర్తి చేయడానికి 37 సంవత్సరాలు పడితే, 200 ప్రయోగాలను పూర్తి చేయడానికి 7.5 సంవత్సరాలు, చివరి 300ను చేరుకోవడానికి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే పట్టింది. సంవత్సరానికి సగటు ప్రయోగాల సంఖ్య 2.7 నుంచి 13.3కు, తర్వాత 23.5కు పెరిగింది. (చదవండి: ఈ కారును ఏడాదికి రెండు సార్లు ఛార్జ్ చేస్తే చాలు!) -
విదేశీ ఉపగ్రహ మార్కెట్‌పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవం తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహా ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
సౌత్ చైనా సీపై డ్రాగన్ డేగ కన్ను
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక శాటిలైట్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ చైనా సీలోని చైనాకు సంబంధించిన హైనాన ద్వీపం కేంద్రంతా.. రిమోట్ శాటిలైట్ సెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధికారలు ప్రకటించారు. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ మిషన్ 2019లో మొదలు పెడుతున్నట్లు శాన్యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డైరెక్టర యాంగ్ తియాన్‌లాంగ్ తెలిపారు. ఈ మిషన్‌లో భాగంగా సౌత్ చైనా సీపై మూడు మొదట ఆప్టికల్ శాటిలైట్స్ ప్రయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలాఉండగా.. 2021 నాటికల్లా.. ఇకమరో మూడు ఆప్టికల్ శాటిలైట్లు, రెండు హైపర్స్పెక్ట్రాల్ శాటిలైట్లు, మరో రెండు ఎస్ఏఆర్ రకానికి చెందిన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని నితరంతం డేగ కళ్లతో కాపు కాస్తుంటాయని చెప్పారు. -
చైనా మరో ముందడుగు
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది. యోగాన్-28 అనే రిమోట్ సెన్సింగ్‌తో పనిచేసే ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. షాంగ్జి ప్రావిన్స్‌లోని తైయువాన్ అనే ప్రాంతం నుంచి ఈ ఉపగ్రహాన్ని ఆదివారం ప్రయోగించినట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రయోగాలు చేసేందుకు, భూముల సర్వేలకు, పంటలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు, విపత్తులను ముందుగానే గుర్తించే దాని నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగించనున్నారు. యోగాన్-28ను లాంగ్ మార్చ్-4బీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా ఇది చైనాకు 217వ ప్రయోగం. చైనా తొలి యోగాన్ ఉపగ్రహాన్ని 2006లో నింగిలోకి పంపించింది.